central govt approved
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ: పండగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్(డియర్నెస్ రిలీఫ్)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్(డియర్నెస్ రిలీఫ్)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపుఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు. -
ఎవరిని మభ్యపెట్టాలని ఈ చట్టాలు?
కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తరుణబ్ ఖైతాన్ ఈ చట్టాలను ‘టర్ట్ ఇట్ ఇన్’ అనే టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (పాత బ్రిటిష్ చట్టం) నుంచి కాపీ, పేస్ట్ చేసిందే.2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్స్టాప్ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.ఓసారి జడ్జీలకు క్లాస్ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్ లా సూత్రాలను చెప్పేవారాయన.ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్ దిద్దుతున్న ప్రొఫెసర్ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్ నేను ఫెయిల్ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్ నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్‌లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్‌లో ‘ప్రొఫెసర్ శ్రీధర్ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్‌ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!పాత బ్రిటిష్ కాలపు క్రిమినల్ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్ సురేంద్రనాథ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?– మాడభూషి శ్రీధర్. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు! -
ఫలించిన వైఎస్ జగన్ కృషి.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషితో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు దక్కాయి. మార్చి 6నే పోలవరం ప్రాజెక్ట్‌కు 12,157 కోట్ల రూపాయల నిధులకు ఆమోదం తెలిపిన కేంద్ర శక్తి శాఖ.. కేబినెట్ ఆమోదం కోసం పంపించింది. అప్పుడే ఎన్డీఏలోకి చేరిన టీడీపీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ నిధులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్సీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు కుట్రకు తెరలేపారు. దీంతో పోలవరం నిధులను కేబినెట్ ఎజెండా నుంచి టీడీపీ తప్పించింది.నిధుల కోసం పోరాటం చేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్లు, రెండవ దశలో 45.72 మీటర్ల మీటర్లు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. తాజా ధరల ప్రకారమే నిర్మాణానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. నాడే వైఎస్ జగన్ విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఇప్పుడు అవ్వే నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం .. ‘కేరళ’ రాష్ట్రం పేరును మారుస్తూ తీర్మానం
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మారుస్తూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. అందుకు అధికార ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.ఈ తీర్మానాన్నిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. కేంద్రం అనుమతి ఇస్తే త్వరలో కేరళ కాస్త.. కేరళంగా మారనుంది. అందుకు త్వరలో విధివిధానాలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కేరళ ప్రభుత్వం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు.తాజాగా, మరోసారి రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదనను సీఎం విజయన్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు.రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని, దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళ’ పేరును ‘కేరళం’ మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.అంతేకాదు భారత రాజ్యంగంలో ఆర్టికల్ 3 కింద కేరళ పేరును కేరళంగా మార్చాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు పలికిందని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
అమలులోకి పేపర్ లీక్ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..
ఢిల్లీ: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది.కాగా, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. The Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 - the anti-paper leak law for examinations for central recruitment and entrance into central educational institutions, came into effect on Friday. A gazette notification issued by the Ministry of Personnel, Public… pic.twitter.com/TMJhsDtcJ5— ANI (@ANI) June 21, 2024ఇక, గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదిలా ఉండగా, కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దీనికి కారణమైన వారికి 5-10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక, ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టానికి లోబడే కేసులు నమోదు చేయనున్నారు. -
తెలంగాణకు కొత్త గవర్నర్.. నేటి సాయంత్రానికి ప్రకటన?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. ఈరోజు సాయంత్రంలోగా కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోగా రాష్ట్రానికి కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక, తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. తమిళనాడులోని ఏదో ఒక పార్లమెంట్ నియోజవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. -
ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు. నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది. విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక!
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక! గ్యాస్‌పై రూ.200 తగ్గించిన కేంద్రం -
అటవీ సంరక్షణ ఇలాగేనా!
‘నేను అరణ్యంలో సంచరించివచ్చిన ప్రతిసారీ ఆ వృక్షాలకు మించి ఎంతో ఎత్తుకెదిగిన భావన నన్ను చుట్టుముడుతుంది’ అంటాడు అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు హెన్రీ డేవిడ్ థోరో. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మన కళ్లముందే చిన్నబోతున్న పర్యావరణానికి జీవం పోయడానికి అడవులు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో అతి ముఖ్యమైన అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు ఆమోదం పొందటం ఆందోళన కలిగి స్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం...అంటే 1980లో ఆమోదం పొందిన అటవీ సంరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. బిల్లు ప్రారంభంలోని లక్ష్య ప్రకటన ఎంతో ఉదాత్తమైనది. భూమండలం వేడెక్కి, పర్యావరణం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్న వర్తమా నంలో అడవుల విస్తరణ అత్యవసరమని ఆ ప్రకటన తెలిపింది. 2030 నాటికల్లా అదనంగా దాదాపు మూడువందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని పారిస్ ఒడంబడికలో మన దేశం హామీ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావించింది. ఇవి సాధించాలంటే అటవీ విస్తరణ, అడవులపై ఆధారపడిన వర్గాల జీవికను మెరుగుపరచటం అవసరమని బిల్లు సరిగానే గుర్తించింది. కానీ అటు తర్వాత ప్రతిపాదించిన సవరణలన్నీ అందుకనుగుణంగా లేవు. మణిపుర్లో దుండగులు సాగించిన అత్యంత అమానవీయ దురంతాలపై విపక్షాలు ఆగ్రహోదగ్రమై చర్చకు పట్టుబట్టిన పర్యవసానంగా పార్లమెంటు స్తంభించిపోవటంతో ఈ సవరణ బిల్లు బుధవారం మూజువాణి ఓటుతో గట్టెక్కింది. ఈమధ్యకాలంలో అత్యంత ప్రాధాన్యతగల ఫైనాన్స్ బిల్లులే ఆ దోవన ఆమోదం పొందిన సందర్భా లుంటున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది గనుక అది తప్పనిసరి కూడా కావొచ్చు. కానీ అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లుకు అంత తొందరేమొచ్చింది? దేశంలో 1980లో అటవీ సంరక్షణ చట్టం ఎందుకు తీసుకురావాల్సివచ్చిందో గుర్తుచేసుకోవాలి. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎడాపెడా అడవుల నరికివేతకు అనుమతి చ్చిన పర్యవసానంగా 42 లక్షల హెక్టార్ల అడవులు కోల్పోయామని గ్రహించిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ చట్టం తీసుకొచ్చేనాటికి పర్యావరణంపై ఇప్పుడున్నంత చైతన్యం లేదు. 1985 తర్వాతే అంతర్జాతీయంగా కూడా పర్యావరణ స్పృహ పెరిగింది. ఒకరకంగా అటవీ సంరక్షణ చట్టం అత్యంత కఠినమైనది. అందువల్లే ఆ చట్టం వచ్చాక ఈ నాలుగు దశాబ్దాల్లో కోల్పోయిన అటవీ భూములు 15 లక్షల హెక్టార్ల లోపే. మన భూభాగంలో కేవలం 21 శాతం మాత్రమే అడవులు న్నాయి. అందులో దట్టమైన అరణ్యాలున్న ప్రాంతం కేవలం 12.37 శాతం. ఈ దట్టమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవటం, వీలైనంతమేరకు విస్తరించటం ధ్యేయం కావలసిన సందర్భంలో తీసుకొచ్చిన సవరణ బిల్లు అందుకనుగుణంగా లేదు. ప్రభుత్వ రికార్డుల్లో అడవులుగా నమోదైన భూములన్నీ అటవీ భూములకిందికే వస్తాయని 1980 చట్టం చెబుతుండగా, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని మరింత విస్తరించింది. నిఘంటు అర్థాన్ని సంతుష్టి పరిచేలా ఉండే భూములు సైతం ఆ చట్టం పరిధిలోకొస్తాయని తెలిపింది. తాజా బిల్లు దాన్ని పూర్తిగా మారుస్తోంది. 1980 లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదైవున్న భూములకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతోంది. నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అడవులుగానే ఉంటున్నా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులకెక్కని భూములున్నాయి. ముఖ్యంగా గడ్డి భూములు, మడ అడవుల వంటి వాటికి అడవులుగా గుర్తింపులేదు. వాటికి అటవీ సంరక్షణ చట్టం వర్తించదని చెబితే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. దేశంలోని అటవీ భూముల్లో 15 శాతం ప్రాంతానికి ఈ సవరణ వల్ల కీడు జరుగుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తాజా బిల్లు దేశభద్రతను ప్రస్తావించి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన అధీన రేఖ, వాస్తవాధీన రేఖ వంటి చోట్ల వంద కిలోమీటర్ల పరిధిలో అటవీభూములుంటే వ్యూహాత్మక అవసరాల కోసం ఆ భూములను ముందస్తు అనుమతి లేకుండానే తీసుకోవచ్చన్న సవరణను ప్రతిపాదించింది. అధీన రేఖ, వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ సానువుల్లో ఉన్నాయి. అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగితే అదెంత ప్రమాదమో వేరే చెప్పనవసరం లేదు. అలాగే తీవ్రవాద కార్యకలాపాల ప్రాంతాలకూ ఈ మాదిరి మినహాయింపే ఉంది. దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకమైనవే. వాటినెవరూ కాదనరు. కానీ అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో మరిచిపోకూడదు. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పర్చటానికి అవరోధాలుంటున్న మాట వాస్తవం. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. కానీ పర్యావరణ హాని, అందువల్ల కలిగే విలయంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోనిది కాదు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి పరిణామాలైనా, ప్రస్తుతం దేశమంతా ముంచెత్తుతున్న వరదలను చూసినా అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యత పరిరక్షణ ఎంత ప్రాణప్రదమో అర్థమవుతుంది. కనుక అవసరా లకూ, ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పుకూ మధ్య సమతూకం ఉండేలా మరింత మెరుగైన ప్రతి పాదనలుండాలి. పార్లమెంటు ఉభయ సభల్లో లోతైన చర్చలు జరిగితే ఇలాంటి సమస్యలు ప్రస్తావనకొచ్చి దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటం విచారకరం. -
ఏపీ కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కొత్త గవర్నర్లు వీరే.. - ఏపీ.. సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్. అబ్దుల్ నజీర్ - అరుణాచల్ ప్రదేశ్.. త్రివిక్రమ్ పర్నాయక్ - సిక్కిం.. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య - ఛత్తీస్‌ఘఢ్.. బిశ్వభూషణ్ హరిచందన్ - మహారాష్ట్ర.. రమేష్ - మేఘాలయ.. చౌహాన్ -
Akasa Air: ఝున్‌ఝున్‌వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Akasa Airlines Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఈ సంస్థకు.. పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ హోల్డింగ్ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ‘ఎన్వోసీ జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు‘ అని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ బోర్డులో ప్రైవేట్ రంగ ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు. సీఈవోగా నియమితులైన దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎయిర్‌బస్, బోయింగ్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: బిగ్‌బుల్‌ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ ఇదీ చదవండి: ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి -
విద్యా విధానంలో భారీ మార్పులు
-
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 21 రొజులే
-
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం
-
రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలతో జట్టు
జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం... ♦ వనరుల సమీకరణ, ప్రాజెక్టులను ♦ వేగంగా పూర్తిచేయడమే లక్ష్యం న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇకపై రాష్ట్రాలకు మరింతగా భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రేల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది. బుధవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర పడింది. రైల్వే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చడం, వేగంగా అమలు చేయడం వంటివి ఈ చర్యల ప్రధానోద్దేశం. వివిధ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు డిమాండ్లు అంతకంతకూ పెరుగున్న నేపథ్యంలో వీటి నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసే జేవీ కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ, తగిన నిధుల సమీకరణ వంటివాటితోపాటు పర్యవేక్షణను కూడా చేపడతాయి. ఈ విధమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేరకు నిధులు లభిస్తాయని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్విటీ వాటా కేటాయింపు ప్రాతిపదికన జేవీ కంపెనీలు ఏర్పాటవుతాయి. ప్రతి జేవీకి ప్రాజెక్టుల సామ ర్థ్యాన్ని అనుసరించి కనీస పెయిడ్-అప్ మూలధనం రూ. 100 కోట్లుగా ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతి రాష్ట్రంతో ఏర్పాటయ్యే జేవీలోనూ రైల్వేల కనీస పెయిడ్-అప్ మూలధనం రూ.50 కోట్లకు పరిమితమవుతుంది. అయితే, భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు/ఈక్విటీ పెంచాలంటే... సంబంధిత యంత్రాంగం నుంచి ప్రాజెక్టులు, నిధుల సమీకరణకు తగిన ఆమోదం లభించాకే వీలవుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మరోపక్క ఈ జేవీ కంపెనీలు నిర్దేశిత ప్రాజెక్టుల కోసం విడివిడిగా ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలకు సైతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు అనుమతిస్తారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, చట్టపరమైన అనుమతులు వేగంగా రావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఈ జేవీ విధానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవలే రైల్వే శాఖ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో జేవీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు కూడా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైల్వే ప్రాజెక్టులకు ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సిమెంట్, స్టీల్ రంగాలకు వేలం ద్వారా బొగ్గు.. ప్రభుత్వ నియంత్రణలోలేని సిమెంటు, స్టీల్ తదితర రంగాలకు బొగ్గు సరఫరాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు వేలం పద్ధతిలోనే బొగ్గును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విభాగంలో స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, ఎరువుల కంపెనీ(యూరియా)లు మినహా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. బొగ్గు సరఫరా ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, వినియోగదారులందరికీ సమాన అవకాశాలను కల్పించం కోసమే వేలం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఏప్రిల్ చివరికల్లా వేలానికి సిద్ధం చేస్తామన్నారు. కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ తమ ఉత్పత్తిలో పావు శాతాన్ని విద్యుత్‌యేతర కంపెనీల కోసం వేలంలో అందుబాటులో ఉంచుతాయని ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. అయితే, కోల్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాలున్న కంపెనీలకు మాత్రం వాటి గడువు పూర్తయ్యేవరకూ సరఫరాలు కొనసాగుతాయని గోయల్ స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్(ఆర్ఈఐఎల్)ను దాని మాతృ సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ నుంచి విడదీసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.