సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషితో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు దక్కాయి. మార్చి 6నే పోలవరం ప్రాజెక్ట్‌కు 12,157 కోట్ల రూపాయల నిధులకు ఆమోదం తెలిపిన కేంద్ర శక్తి శాఖ.. కేబినెట్ ఆమోదం కోసం పంపించింది. అప్పుడే ఎన్డీఏలోకి చేరిన టీడీపీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ నిధులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్‌సీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు కుట్రకు తెరలేపారు. దీంతో పోలవరం నిధులను కేబినెట్ ఎజెండా నుంచి టీడీపీ తప్పించింది.
నిధుల కోసం పోరాటం చేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్లు, రెండవ దశలో 45.72 మీటర్ల మీటర్లు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. తాజా ధరల ప్రకారమే నిర్మాణానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. నాడే వైఎస్ జగన్ విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఇప్పుడు అవ్వే నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment