
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. ఈరోజు సాయంత్రంలోగా కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోగా రాష్ట్రానికి కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక, తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. తమిళనాడులోని ఏదో ఒక పార్లమెంట్ నియోజవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు.