
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలందరికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పెద్ద పండుగకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానముందని పేర్కొన్నారు. సమృద్ధిగా ఇంటికి చేరిన ధాన్యం సిరులు, పంటల నడుమ వ్యవసాయదారులు, ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు.
మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వంతో కూడిన ఉదాత్తమైన ఆలోచనలకు సంక్రాంతి పండుగ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment