సాక్షి, అమరావతి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో...మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఇక మీదట కూడా ఇదే విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని, భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
Published Tue, Jan 14 2020 3:52 AM | Last Updated on Tue, Jan 14 2020 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment