సాక్షి, అమరావతి: ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల అస్త్రం ఓటు హక్కని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారందర్నీ ఓటర్లుగా నమోదు చే యించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగా 3.03 లక్షల మంది ఓటర్ల నమోదుతో పాటు, మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాశాల విద్య కమిషనర్ పి.భాస్కర్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదా వరి జిల్లాల కలెక్టర్లు కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎం.హరినారాయణ, ఎ.మల్లికార్జున, పి.ప్రశాంతి, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఎంఎన్.హరేంద్ర ప్రసాద్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్‌కుమార్‌లతో పాటు ఏఆర్‌వోలు, బీఆర్‌వోలకు గవర్నర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు.
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
Published Thu, Jan 26 2023 5:16 AM | Last Updated on Thu, Jan 26 2023 2:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment