
సాక్షి, అమరావతి: సత్యం, అహింస, సమగ్రత, సార్వభౌమాధికారాల పరిరక్షణకు పునరంకితం కావాలని ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక విలువలే దిక్సూచిగా దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని గవర్నర్ సూచించినట్లు రాజ్‌భవన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.