
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు త్వరలో ప్రభుత్వం విద్యుత్ వాహనాల ప్రణాళికను తీసుకురానుందని రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యుత్ సౌధలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. విద్యుత్ వాహనాల చార్జింగ్ ఏజెన్సీలతో పాటు రిటైల్ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను విక్రయించేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ సరఫరా కోసం రిటైల్ టారిఫ్ పట్టికలో కేటగిరీని ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment