Transco CMD D. Prabhakar Rao
-
విద్యుత్ పీఆర్సీకి సీఎం సానుకూలం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, ఈసారి కూడా మంచి పీఆర్సీ ప్రకటిస్తా రని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతటి ఆర్థిక సంక్షో భంలోనూ పీఆర్సీకి ముఖ్యమంత్రి అంగీకరించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజ నీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ సౌధలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆర్థికపరమైన అంశాల్లోనే కాకుండా పనిలోనూ క్రమశిక్షణ పాటించాలని విద్యుత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలతో పాటు తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. వినియోగదారుల ఆగ్రహానికి గురికాకుండా నాణ్యమైన సేవలందిం చాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. రూ.35 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని, ఇంత ఖర్చు చేసినా వినియోగదారుల మన్ననలను చూర గొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
మరో 2 వేల విద్యుత్ కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ శాఖ త్వరలో మరో 2 వేల పోస్టులను భర్తీ చేయనుందని తెలంగాణ ట్రాన్స్‌కో తెలిపింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కలిపి మొత్తం 12,171 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేశాయని, మరో 22,637 మంది విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నాయని పేర్కొంది. కొత్త నియామకాలతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రూపంలో గత ఐదేళ్లలో మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అత్యధిక మందికి ఉద్యోగాలిచ్చిన విభాగంగా విద్యుత్ శాఖ రికార్డు సృష్టించిందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే విద్యుత్ సంస్థల ఆదాయంలో 9 శాతం ఉద్యోగుల వేతనాలకు వెచ్చిస్తున్నామని, వేతనాల చెల్లింపులో తెలంగాణ విద్యుత్ శాఖ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లో 5 నుంచి 7 శాతం వరకే జీతభత్యాలకు చెల్లిస్తున్నారని తెలిపింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగావకాశం లభించిందని ట్రాన్స్‌కో తెలిపింది. విద్యుత్ శాఖలోనే ఎక్కువ నియామకాలు జరగడం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితమే. ప్రైవేటులో కాకుండా జెన్ కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఉత్పత్తి ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాం.ఉద్యోగ భద్రత లేకుండా, ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన 22,637 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేసుకోవాలనే మానవతా నిర్ణయం కూడా సీఎందే. వారి ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల (స్టాండింగ్ ఆర్డర్ల)ను కూడా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. పెద్ద ఎత్తున నియామకాలు జరపడమే కాకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
సీబీఐ విచారణకు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన ఆరోపణలను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా, పూర్తి విలువలతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతోనే కాదు సీబీఐ విచారణకు సైతం సిద్ధమని పేర్కొన్నారు. విద్యుత్‌సౌధలో శుక్రవారం ప్రభాకర్‌రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మణ్ పేరు ప్రస్తావించకుండానే ఆయన ఆరోపణలకు బదులిచ్చారు. సమాచారలోపంతో సరైన అవగాహనలేకనే ఈ ఆరోపణలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనీ్టపీసీ రూ.4.30కు యూనిట్ చొప్పున సౌర విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందనడం పూర్తిగా సత్యదూరమన్నారు. ఎనీ్టపీసీ 400 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిందని, ఒప్పందం ద్వారా రూ.4.61 నుంచి రూ.5.19 ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 71 మెగావాట్ల సౌరవిద్యుత్ స్థాపిత సామర్థ్యం కలిగి ఉన్నామని, ఇప్పుడు 3,600 మెగావాట్లకు పెంచామన్నారు. సౌరవిద్యుత్‌ను నిర్లక్ష్యం చేయలేదు... సౌరవిద్యుత్‌ను నిర్లక్ష్యం చేసినట్లు విమర్శించడం సరికాదని, మన సౌర విద్యుత్ విధా నం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఎన్నో ప్రశంసలు, పుర స్కారాలు అందుకుందని ప్రభాకర్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల మాత్రమే ఉన్న స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 16,200 మెగావాట్లకు పెంచామన్నారు. 14 వేల మెగావాట్ల ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని రూ.23 వేల కోట్ల ఖర్చుతో 31 వేల మెగావాట్లకు పెంచామన్నారు. ఎంవోయూ ఆధారంగానే పీపీఏ ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, దీని ఆధారంగా రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పీపీఏ చేసుకున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ. 3.90 పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యుత్ సంస్థల ఆర్థికస్థితి బాగా లేదని, రేటింగ్ పడిపోయిందని అనడం సరికాదని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అత్యుత్తమమైన ‘ఏ+’రేటింగ్ ఇచి్చందన్నారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇండియా బుల్స్ సంస్థతో ఒప్పందం చేసున్నట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. విద్యుత్ సంస్థలు స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయనీ, తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీఎండీ అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే సౌత్, నార్త్ కనెక్టివిటీ గ్రిడ్ సాధ్యమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థకు అనేక ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. -
త్వరలో విద్యుత్ వాహనాల ప్రణాళిక!
సాక్షి, హైదరాబాద్: ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు త్వరలో ప్రభుత్వం విద్యుత్ వాహనాల ప్రణాళికను తీసుకురానుందని రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యుత్ సౌధలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. విద్యుత్ వాహనాల చార్జింగ్ ఏజెన్సీలతో పాటు రిటైల్ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్‌ను విక్రయించేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ సరఫరా కోసం రిటైల్ టారిఫ్ పట్టికలో కేటగిరీని ఏర్పాటు చేశామన్నారు. -
ఇక కోర్టులోనే తేల్చుకుంటాం
* ఏపీ విద్యుత్ ఉద్యోగులు తొందరపాటుతో కోర్టుకెళ్లారు * ఇక చర్చలకు అవకాశం లేదు * కోర్టుకు వెళ్లకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది * చర్చలు జరిపి మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేసేవాళ్లం * ‘సాక్షి’తో రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో ఇక చర్చల ప్రసక్తే లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు కుండబద్దలు కొట్టారు. ఏపీ ఉద్యోగులు తొందరపాటుతో హైకోర్టును ఆశ్రయించడంతో చర్చలకు తలుపులు మూసుకుపోయాయన్నారు. ఈ అంశాన్ని తాము సైతం కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో రూపొందించిన ఉద్యోగుల 1,251 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు ఈ నెల 6న, ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు ఈ నెల 10, 11 తేదీల్లో జారీ కాగా, కొందరు ఏపీ ఉద్యోగులు 11న హైకోర్టును ఆశ్రయించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ అంశంపై గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సోమవారం డివిజన్ బెంచ్ ముందు అప్పీలు పిటిషన్ వేస్తామన్నారు. ఏపీ ఉద్యోగులు తొందరపడి హైకోర్టుకు వెళ్లకుండా ఉంటే, ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్‌తో చర్చలు జరిపి ఆయన సూచనల మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో మార్పులు చేసే అవకాశం ఉండేదన్నారు. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ‘సమాన హోదా’ గల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించుకుందామని పలుమార్లు లేఖలు రాసినా ఏపీ సంస్థల నుంచి స్పందన లేదన్నారు. ఏపీ నుంచి సరైన సహకారం లేకపోవడంతోనే తామే ఉద్యోగుల విభజన జరిపామన్నారు. ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపాలని కోరినా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. సాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్రానిదే.. ఆస్తుల కేటాయింపుల్లో భాగంగా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ తెలంగాణకు వచ్చిందని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. తాజాగా టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వం భద్రతా దళాలను ఎందుకు మోహరించిందో తనకు తెలియదని, ఈ అంశంపై ఇటీవల కాలంలో ఏపీతో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరగలేదని ఆయన తెలిపారు.