
హి షియాంగ్ వయసు 77. ‘మిడియా’ అనే విద్యుత్ గృహోపకరణాల కంపెనీ యజమాని. బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితాలో ఆయనది చైనాలో ఏడవ స్థానం. ప్రపంచంలో 36వ స్థానం. కంపెనీ హాంగ్ కాంగ్ సమీపంలోని ఫొషాన్‌లో నది పక్కన ఉంది. అక్కడే ఆయన నివాస భవనం. ఆదివారం రాత్రి నలుగురు దుండగులు ప్రధాన ద్వారాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి షియాంగ్‌ను బందీగా పట్టుకున్నారు. భవంతినంతా గాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న షియాంగ్ కొడుకు 55 ఏళ్ల జియాంగ్ ఫెంగ్ భవంతి వెనుక నుంచి తప్పించుకుని బయటికి వచ్చాడు. అడ్డంగా నది!! రాత్రంతా ఆ నదిని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరి పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లొచ్చి పెద్దాయన్ని విడిపించి ఇంకా అక్కడే ఉన్న దుండగులను అరెస్ట్ చేశారు. నదిని అంతసేపు ఎలా ఈదారని ఫెంగ్‌ని అడిగారు. ‘‘నాన్న బందీగా ఉన్నారు. ఆయన్ని విడిపించుకోలేక పోతే నా స్వచ్ఛకు అర్థం ఏమిటి?’’ అన్నాడు ఫెంగ్!
Comments
Please login to add a commentAdd a comment