నిత్యం పొగలు గక్కుతుండే నది..ఏకంగా 100 డిగ్రీ సెల్సియస్‌.. | Shanay Timpishka The Worlds Only Boiling River | Sakshi
Sakshi News home page

నిత్యం పొగలు గక్కుతుండే నది..ఏకంగా 100 డిగ్రీ సెల్సియస్‌..

Published Wed, Oct 4 2023 10:44 AM | Last Updated on Wed, Oct 4 2023 10:47 AM

Shanay Timpishka The Worlds Only Boiling River - Sakshi

ప్రకృతి నిజంగా చాలా గొప్ప అద్భుతాలను పరిచయం చేస్తుంది. అవి నిజంగా ఎలా ఏర్పడ్డాయన్నది ఓ మిస్టరీ. సహజసిద్ధంగా ఏర్పడే ఆ అద్భుతాలు చూసి ఎంజాయ్‌ చేయాలే గానీ వాటితో ఆటలు ఆడాలనుకుంటే అంతే సంగతి. అలాంటి అద్భుతమైన నదే ఈ బాయిల్డ్‌ రివర్‌. ఈ నది ఎక్కడ ఉంది? దాని కథ కమామీషు ఏంటో చూద్దాం.!

ఈ నది దక్షిణ అమెరికాలోని పెరువియన్‌ అమెజన్‌ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన నదికి ఉపనిదిగా కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా అనే మరుగుతున్న నది. నిజానికి ఇది లా బొంబా నదిగానే బాగా ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6.4 కిలోమీటర్లు పొడవైన నది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ (100 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. ఇలా ఈ నది ఎందుకు నిత్యం మరుగుతూ పొగలు గక్కుతూ ఉందనేది ఓ అంతు పట్టని మిస్టరీగా ఉంది.

అక్కడ ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటంతోనే ప్రవహించే నీరు మరుగుతుందని చెబుతుంటారు. మరికొందరూ భూ ఉష్ణోగ్రత కారణంగా అని అంటారు. మరీ మిగతా నదులు అలా లేవు కదా మరీ ఈ నది ఇలా ఎందుకు ఉందని? చాలా మందిని తొలిచే ప్రశ్న?. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు లేదా కనుగొనలేకపోయారు. ఈ ఉడుకుతున్న నీటిలో ఏవైనా క్షణాల్లో ఉడికిపోతాయి. పైగా నేరుగా ఒట్టి చేతులను అస్సలు పెట్టే సాహసం చేయకూడదు.

కానీ స్థానికులు మాత్రం ఈ నది జలాలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని విశ్వస్తారు. అందుకే ఈ ప్రాంతానికి జనాలు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉండగా పర్యావరణ ప్రేమికులు ఇలా పర్యాటకులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వద్దకు వస్తే అవి కూడా కాలుష్యానికి గురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన ఈ హాట్‌ టబ్‌ని రక్షించడం కోసం పర్యాటకుల తాకిడిని తగ్గించేలా ఇప్టికే పపలు ఆంక్షాలను విధించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి కూడా. 

(చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement