Boiling
-
నిత్యం పొగలు గక్కుతుండే నది..ఏకంగా 100 డిగ్రీ సెల్సియస్..
ప్రకృతి నిజంగా చాలా గొప్ప అద్భుతాలను పరిచయం చేస్తుంది. అవి నిజంగా ఎలా ఏర్పడ్డాయన్నది ఓ మిస్టరీ. సహజసిద్ధంగా ఏర్పడే ఆ అద్భుతాలు చూసి ఎంజాయ్ చేయాలే గానీ వాటితో ఆటలు ఆడాలనుకుంటే అంతే సంగతి. అలాంటి అద్భుతమైన నదే ఈ బాయిల్డ్ రివర్. ఈ నది ఎక్కడ ఉంది? దాని కథ కమామీషు ఏంటో చూద్దాం.! ఈ నది దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన నదికి ఉపనిదిగా కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా అనే మరుగుతున్న నది. నిజానికి ఇది లా బొంబా నదిగానే బాగా ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6.4 కిలోమీటర్లు పొడవైన నది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ (100 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. ఇలా ఈ నది ఎందుకు నిత్యం మరుగుతూ పొగలు గక్కుతూ ఉందనేది ఓ అంతు పట్టని మిస్టరీగా ఉంది. అక్కడ ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటంతోనే ప్రవహించే నీరు మరుగుతుందని చెబుతుంటారు. మరికొందరూ భూ ఉష్ణోగ్రత కారణంగా అని అంటారు. మరీ మిగతా నదులు అలా లేవు కదా మరీ ఈ నది ఇలా ఎందుకు ఉందని? చాలా మందిని తొలిచే ప్రశ్న?. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు లేదా కనుగొనలేకపోయారు. ఈ ఉడుకుతున్న నీటిలో ఏవైనా క్షణాల్లో ఉడికిపోతాయి. పైగా నేరుగా ఒట్టి చేతులను అస్సలు పెట్టే సాహసం చేయకూడదు. కానీ స్థానికులు మాత్రం ఈ నది జలాలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని విశ్వస్తారు. అందుకే ఈ ప్రాంతానికి జనాలు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉండగా పర్యావరణ ప్రేమికులు ఇలా పర్యాటకులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వద్దకు వస్తే అవి కూడా కాలుష్యానికి గురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన ఈ హాట్ టబ్‌ని రక్షించడం కోసం పర్యాటకుల తాకిడిని తగ్గించేలా ఇప్టికే పపలు ఆంక్షాలను విధించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి కూడా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!
బీహార్‌లోని భాగల్పూర్లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు? -
గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని బాలుడు మృతి
సిద్దిపేట కమాన్: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో రెండేళ్లు బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేటలోని దౌల్తాబాద్‌లో జరిగింది. వివరాలు.. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన రమేశ్, సంగీత దంపతుల కుమారుడు నిహాన్ సోమవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది ఇచ్చిన ఉడకబెట్టిన కోడిగుడ్డును ఇంటికి తీసుకొని వచ్చాడు. అనంతరం బాలుడికి తల్లి ఆహారాన్ని పెట్టి పని నిమిత్తం బయటకు వెళ్లింది. కాగా, కోడిగుడ్డును తినే క్రమంలో గొంతులో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన బాలుడి కుటుంబ సభ్యులు 108లో సిద్దిపేటలోని మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించగా.. అప్పటికే మృతిచెందాడు. -
తలనొప్పి వస్తోందంటే.. వేడినూనె పోశాడు
తమిళనాడులోని మదురైలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్న బాలకార్మికుడిపై యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. ఆరోగ్యం బాగోలేదన్న బాలుడిని ఆదుకోవాల్సిందిపోయి.. సలసల మరిగే వేడినూనె కుమ్మరించాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మదురైలోని ఒక స్వీటుషాపులో బాలుడు (15) పనిచేస్తున్నాడు. తనకు తలనొప్పిగా ఉందని యజమానికి చెప్పాడు. పని చేయడానికి సాకులు చెపుతున్నాడంటూ యజమాని ఆగ్రహానికి గురయ్యాడు. వేడి వేడి నూనెను బాలుడిపై పోసేశాడు. దీంతో చేతులు, తొడలు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మైనర్ బాలుడిని పనిలో పెట్టుకోవడమేకాకుండా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన సదరు యజమానిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకుని బాధిత బాలుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!
మైక్రో అవన్... ఇది మధ్య తరగతివారికి అందని వస్తువుల లిస్టులోనే ఉంది ఇంకా. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప మామూలు వాళ్లెవరూ దీన్ని కొనుక్కోరు. కానీ నిజానికి ఇది అందరిళ్లలోనూ ఉండటం మంచిదే. ఎందుకంటే అవన్‌తో పెద్ద ఉపయోగమే ఉంది. నూనె వాడకుండానే వంట చేసుకోవచ్చు. వేడి, ఆవిరితోనే ఆహార పదార్థాలు ఉడకబెడుతుంది ఈ యంత్రం. అందుకే అవన్ కచ్చితంగా అవసరమైన యంత్రమే. కానీ ఐదారు వేలు పెట్టాలంటే కాస్త కష్టమనిపిస్తుంది. ఆ కష్టాన్ని లేకుండా చేసేందుకే మినీ అవన్లు వచ్చాయి. షాపుకెళ్లి... ‘ర్యాపిడ్ వేవ్ కన్వెక్షన్ కౌంటర్‌టాప్ అవన్’ ఇవ్వమంటే వెంటనే ఈ బుజ్జి అవన్ని మీ చేతిలో పెడతారు. బాయిలింగ్, స్టీమింగ్, రోస్టింగ్, బేకింగ్‌తో పాటు మరో రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. ఆన్లైన్ స్టోర్స్‌లో రూ. 2,500కి వచ్చేస్తోంది. బయట షాపుల్లో కొంటే మాత్రం మూడు వేల వరకూ పెట్టాల్సి వస్తుంది. ఆలస్యమెందుకు... వెంటనే కొనేసుకోండి. అనారోగ్య భయంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోండి!