
సిద్దిపేట కమాన్: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో రెండేళ్లు బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేటలోని దౌల్తాబాద్‌లో జరిగింది. వివరాలు.. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన రమేశ్, సంగీత దంపతుల కుమారుడు నిహాన్ సోమవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది ఇచ్చిన ఉడకబెట్టిన కోడిగుడ్డును ఇంటికి తీసుకొని వచ్చాడు.
అనంతరం బాలుడికి తల్లి ఆహారాన్ని పెట్టి పని నిమిత్తం బయటకు వెళ్లింది. కాగా, కోడిగుడ్డును తినే క్రమంలో గొంతులో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన బాలుడి కుటుంబ సభ్యులు 108లో సిద్దిపేటలోని మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించగా.. అప్పటికే మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment