బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే! | advantages with micro Avan | Sakshi
Sakshi News home page

బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!

Published Sun, Jul 13 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!

బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!

మైక్రో అవన్... ఇది మధ్య తరగతివారికి అందని వస్తువుల లిస్టులోనే ఉంది ఇంకా. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప మామూలు వాళ్లెవరూ దీన్ని కొనుక్కోరు. కానీ నిజానికి ఇది అందరిళ్లలోనూ ఉండటం మంచిదే. ఎందుకంటే అవన్‌తో పెద్ద ఉపయోగమే ఉంది. నూనె వాడకుండానే వంట చేసుకోవచ్చు. వేడి, ఆవిరితోనే ఆహార పదార్థాలు ఉడకబెడుతుంది ఈ యంత్రం. అందుకే అవన్ కచ్చితంగా అవసరమైన యంత్రమే. కానీ ఐదారు వేలు పెట్టాలంటే కాస్త కష్టమనిపిస్తుంది. ఆ కష్టాన్ని లేకుండా చేసేందుకే మినీ అవన్లు వచ్చాయి.
 
షాపుకెళ్లి... ‘ర్యాపిడ్ వేవ్ కన్వెక్షన్ కౌంటర్‌టాప్ అవన్’ ఇవ్వమంటే వెంటనే ఈ బుజ్జి అవన్‌ని మీ చేతిలో పెడతారు. బాయిలింగ్, స్టీమింగ్, రోస్టింగ్, బేకింగ్‌తో పాటు మరో రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. ఆన్‌లైన్ స్టోర్స్‌లో రూ. 2,500కి వచ్చేస్తోంది. బయట షాపుల్లో కొంటే మాత్రం మూడు వేల వరకూ పెట్టాల్సి వస్తుంది. ఆలస్యమెందుకు... వెంటనే కొనేసుకోండి. అనారోగ్య భయంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement