Steaming
-
బుజ్జి పాపాయిల కోసం.. వాళ్లకు నచ్చే విధంగా రుచికరమైన ఆహారం
ఇప్పుడిప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లిబుజ్జాయిలకి.. ఈ ప్యూరీ బ్లెండర్ బేబీ ఫుడ్ సప్లిమెంట్ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు నచ్చేవిధంగా.. మృదువుగా, రుచికరంగా ఆహారాన్ని ఉడికించి, పేస్ట్ చేస్తుంది. సాధారణంగా ఆపిల్, క్యారెట్, బీట్రూట్ వంటి పోషకాహారాలను కుక్ చేసి.. మెత్తగా క్రీమ్‌లా చేయడం చాలా సమయంతోనూ శ్రమతోనూ కూడిన పని. కానీ ఈ ఆటోమేటిక్ స్టీమింగ్ అండ్ బ్లెండింగ్ మేకర్ కొన్ని నిమిషాల్లోనే వేడివేడిగా ఆ క్రీమ్‌ని అందిస్తుంది. నాలుగు హైక్వాలిటీ బ్లేడ్స్‌తో వేగంగా పనిచేస్తుంది. ఈ మెషిన్స్‌లో చాలా రంగులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో చికెన్, ఫిష్ కూడా ఉడికించుకోవచ్చు. ముందుగా ఎడమవైపున్న వాటర్ ట్యాంక్‌లో వాటర్ నింపుకుని.. కుడివైపున ఆహారాన్ని వేసుకుని.. ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ మూత పక్కనే.. డిస్ప్లేలో ఆప్షన్స్ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. -
బుల్లి బుజ్జాయిల కోసం.. ఈ డివైజ్ ధర 4,947 రూపాయలు
Baby Food Device: ఇంటి పని, ఆఫీస్ పనితో నిరంతరం సతమతమయ్యే న్యూ పేరెంట్స్‌కి ఈ బేబీ ఫుడ్ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లి బుజ్జాయిలకు పోషకాహారం చాలా అవసరం. అందుకే ఈ మేకర్ వేడివేడిగా.. పిల్లలకు నచ్చే ప్రొటీన్స్తో కూడిన ఆహారాన్ని అందిస్తుంది. ఇందులో ఆహారాన్ని ఉడికించుకోవడంతో పాటు పిల్లలు తేలికగా తినేందుకు వీలుగా ఆ ఆహారాన్ని మిక్సీ పట్టుకోవచ్చు. అందుకు అనుకూలంగా రూపొందిన మేకర్ ఇది. ఇందులో జ్యూస్, బొప్పాయి పేస్ట్, యాపిల్ పేస్ట్, బనానా పేస్ట్ వంటివి ఎన్నో పిల్లలకు నచ్చేవిధంగా సిద్ధం చేసుకోవచ్చు. అందుకు కుడివైపు ఫుడ్ సేఫ్టీ మెటీరియల్‌తో రూపొందిన ఒక జగ్ ఉంటుంది. దానిలోపలే మిక్సీ బ్లేడ్స్ ఉంటాయి. దాంతో అందులోనే ఉడికించి, అందులోనే మిక్సీ పట్టుకునే వీలుంటుంది. దాంతో ఆహారం వేడి వేడిగా ఉంటుంది. ఎడమవైపు పైభాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది (చిత్రంలో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది). దానిలో వాటర్ నింపుకుని.. జగ్‌లో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు వంటివి వేసుకుని ముందువైపు ఉన్న రెగ్యులేటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీమింగ్, రీహీటింగ్, బ్లెండింగ్ వంటి ఆప్షన్స్ ఉపయోగించి ఈ మేకర్‌ను చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. ధర : 65 డాలర్లు (రూ.4,947) -
ఇంట్లోనే స్టీమ్!
ముఖానికి మంచినీటితో ఆవిరి పట్టడాన్ని స్టీమింగ్ అంటారు. ముఖానికి పట్టే జిడ్డుని, పొల్యూషన్‌ని వదిలించడానికి స్టీమింగ్ ఉపయోగపడుతుంది. ప్రతిసారీ బ్యూటీపార్లర్‌కు వెళ్లడం కష్టంగా ఉన్నా, బ్యూటీపార్లర్ అందుబాటులో లేకపోయినా ఇంట్లోనే స్టీమింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో చిన్న కంటెయినర్లు దొరుకుతున్నాయి. కంటెయినర్లో ఒక గ్లాసు నీటిని పోసి ప్లగ్‌లో పెట్టి కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే నిమిషం లోపు నీరు మరుగుతాయి. మరుగుతున్న నీటి మీద నుంచి వచ్చే ఆవిరిని ముఖానికి అందించాలి. ఇందుకోసం కంటెయినర్కి ఒక వైపు చిన్న మూత ఉంటుంది. ఆ మూత తెరిస్తే ఆవిరి పక్కలకు వృథాగా పోకుండా నేరుగా ముఖానికి తగులుతుంది. ఇక్కడ చిన్న జాగ్రత్త పాటించాలి. మరిగే నీటికంటే ఆవిరికి వేడి ఎక్కువ. కాబట్టి దేహం భరించలేనంత వేడి ఒక్కసారిగా తగిలితే ముఖం కమిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆవిరి వచ్చే మూత తెరిచిన వెంటనే... ఆ ఆవిరి నేరుగా చేతికి తగిలేలా చేసి వేడిని గమనించుకోవాలి. భరించగలిగినంత వేడి మాత్రమే ఉందని నిర్ధారించుకున్న తర్వాత ముఖానికి పట్టించాలి. ముఖానికి పట్టించేటప్పుడు కూడా ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. కొద్ది సెకన్లు చెంపలు, ఆ తర్వాత చుబుకం, నుదురు, కణతలు, మళ్లీ కొద్ది సెకన్లు చుబుకం... ఇలా ముఖమంతా పట్టేటట్లు చేయాలి. దాదాపుగా రెండునిమిషాలు స్టీమింగ్ పెడితే సరిపోతుంది. స్టీమింగ్ తర్వాత ముఖాన్ని టవల్‌తో తుడిచి బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేయాలి. బొప్పాయి అన్ని రకాల చర్మాలకీ మేలు చేస్తుంది. -
బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!
మైక్రో అవన్... ఇది మధ్య తరగతివారికి అందని వస్తువుల లిస్టులోనే ఉంది ఇంకా. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప మామూలు వాళ్లెవరూ దీన్ని కొనుక్కోరు. కానీ నిజానికి ఇది అందరిళ్లలోనూ ఉండటం మంచిదే. ఎందుకంటే అవన్‌తో పెద్ద ఉపయోగమే ఉంది. నూనె వాడకుండానే వంట చేసుకోవచ్చు. వేడి, ఆవిరితోనే ఆహార పదార్థాలు ఉడకబెడుతుంది ఈ యంత్రం. అందుకే అవన్ కచ్చితంగా అవసరమైన యంత్రమే. కానీ ఐదారు వేలు పెట్టాలంటే కాస్త కష్టమనిపిస్తుంది. ఆ కష్టాన్ని లేకుండా చేసేందుకే మినీ అవన్లు వచ్చాయి. షాపుకెళ్లి... ‘ర్యాపిడ్ వేవ్ కన్వెక్షన్ కౌంటర్‌టాప్ అవన్’ ఇవ్వమంటే వెంటనే ఈ బుజ్జి అవన్ని మీ చేతిలో పెడతారు. బాయిలింగ్, స్టీమింగ్, రోస్టింగ్, బేకింగ్‌తో పాటు మరో రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. ఆన్లైన్ స్టోర్స్‌లో రూ. 2,500కి వచ్చేస్తోంది. బయట షాపుల్లో కొంటే మాత్రం మూడు వేల వరకూ పెట్టాల్సి వస్తుంది. ఆలస్యమెందుకు... వెంటనే కొనేసుకోండి. అనారోగ్య భయంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోండి!