Baby Food Device: ఇంటి పని, ఆఫీస్ పనితో నిరంతరం సతమతమయ్యే న్యూ పేరెంట్స్‌కి ఈ బేబీ ఫుడ్ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లి బుజ్జాయిలకు పోషకాహారం చాలా అవసరం. అందుకే ఈ మేకర్ వేడివేడిగా.. పిల్లలకు నచ్చే ప్రొటీన్స్‌తో కూడిన ఆహారాన్ని అందిస్తుంది. ఇందులో ఆహారాన్ని ఉడికించుకోవడంతో పాటు పిల్లలు తేలికగా తినేందుకు వీలుగా ఆ ఆహారాన్ని మిక్సీ పట్టుకోవచ్చు.
అందుకు అనుకూలంగా రూపొందిన మేకర్ ఇది. ఇందులో జ్యూస్, బొప్పాయి పేస్ట్, యాపిల్ పేస్ట్, బనానా పేస్ట్ వంటివి ఎన్నో పిల్లలకు నచ్చేవిధంగా సిద్ధం చేసుకోవచ్చు. అందుకు కుడివైపు ఫుడ్ సేఫ్టీ మెటీరియల్‌తో రూపొందిన ఒక జగ్ ఉంటుంది. దానిలోపలే మిక్సీ బ్లేడ్స్ ఉంటాయి. దాంతో అందులోనే ఉడికించి, అందులోనే మిక్సీ పట్టుకునే వీలుంటుంది.
దాంతో ఆహారం వేడి వేడిగా ఉంటుంది. ఎడమవైపు పైభాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది (చిత్రంలో బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది). దానిలో వాటర్ నింపుకుని.. జగ్‌లో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు వంటివి వేసుకుని ముందువైపు ఉన్న రెగ్యులేటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీమింగ్, రీహీటింగ్, బ్లెండింగ్ వంటి ఆప్షన్స్ ఉపయోగించి ఈ మేకర్‌ను చాలా సులభంగా వినియోగించుకోవచ్చు.
ధర : 65 డాలర్లు (రూ.4,947)
Comments
Please login to add a commentAdd a comment