ముంబై: కోవిడ్-19 మరణాలను ముంబై తక్కువ చేసి చూపించడంలేదని లేదని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పష్టం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ మృతులు డేటాను రహస్యంగా కప్పిపెట్టలేదన్నారు. మృతదేహాలను డంప్ చేయడానికి మాకు ఇక్కడ నదులు లేవని వ్యంగ్యంగా స్పందించారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో పలు చోట్ల శవాలు నదిలో తేలుతూ కనిపించగా, మరి కొన్ని నది ఒడ్డున కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
ముంబైలో కోవిడ్ మృతులను గుట్టుచప్పడుకాకుండా పడేసేందుకు ఇక్కడ నది లేదన్నారు. ముంబైలో కోవిడ్ వల్ల చనిపోతున్నవారి వివరాలను మూడు ప్రదేశాల్లో నమోదు చేస్తున్నారని, అందుకే ఎక్కడా డేటాను దాచిపెట్టేదిలేదని ఆమె అన్నారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇలా కౌంటర్ ఇచ్చారు. కాగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఇంతకుముందు పౌరసంఘం, మహారాష్ట్ర ప్రభుత్వం మరణాల డేటాను తప్పుగా చూపిస్తున్నాయని ఆరోపించారు. మహమ్మారి కారణంగా మహారాష్ట్ర అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అక్కడ సెకండ్ వేవ్ మొదట్లో రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతూ ఆందోళన కలిగించగా, ప్రస్తుతం అక్కడ పరిస్థితిలో స్థిరమైన మెరుగుదల కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment