ఏటిలో ముగ్గురు గల్లంతు | Three People Drowned In River At Khammam District | Sakshi
Sakshi News home page

ఏటిలో ముగ్గురు గల్లంతు

Published Fri, Aug 12 2022 1:59 AM | Last Updated on Fri, Aug 12 2022 3:36 PM

Three People Drowned In River At Khammam District - Sakshi

వెంకటేశ్వర్లు, ప్రదీప్, రంజిత్‌

నేలకొండపల్లి: చేపల వేట కోసం వెళ్లి ఏరులో ఒకరు గల్లంతు కాగా, అతడిని రక్షించేందుకు వచ్చిన డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు కూడా ఇద్దరు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దే పల్లిలో గురువారం జరిగింది. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన నలుగురు యువకులు చేపలు పట్టేందుకు సుర్దేపల్లి ఏటికి వెళ్లారు. వీరిలో అఫ్జల్, పగడాల రంజిత్‌ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు అఫ్జల్‌ను కాపాడారు.

రంజిత్‌ కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో ఖమ్మం మున్సిపల్‌ కార్యాలయానికి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పిలిపించారు. బృందంలోని బోశెట్టి ప్రదీప్‌ పడిగెల వెంకటేశ్వర్లు, శివశంకర్, విజయ్‌ గల్లంతైన రంజిత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో వెంకటేశ్వర్లు (22), ప్రదీప్‌ (32) తాడు సాయంతో వంతెనపై నుంచి కిందకు దిగారు. అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. వీరిలో వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement