
శివమొగ్గ: సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసేస్తున్నా యువతలో మార్పు రావడం లేదు. తాజాగా శివమొగ్గ తాలకా గాజనరులోని తుంగా జలాశయం పవర్ హౌజ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు జారి నీటిలో పడిగల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగుచసింది.
వివరాలు...మిళఘట్ట లేఔట్‌కు చెందిన హరీష్ (26) శుక్రవారం సాయంత్రం సెల్ఫీ తీసుకోవడానికి పవర్‌హౌజ్ వద్దకు వెళ్లాడు. అంచుకు వెళ్లి తీసుకుందామని అనుకున్నాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. తుంగా నగర పోలీసులు కేసు నవెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.
చదవండి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత?