
రన్ వేపై చెల్లాచెదురుగా పడిన బంగారం
క్రస్నోయాక్స్, రష్యా : కోట్లు విలువజేసే బంగారం విమాన రన్ వేపై వర్షంలా కురిసింది. అవును. టేకాప్ అయిన కొద్ది నిమిషాల్లోనే కార్గో విమానం తలుపు తెరచుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నల్లటి రోడ్డుతో కనిపించే రన్ వేపై బంగారం చెల్లాచెదురుగా పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యాలోని యకుస్క్ ప్రాంతంలో గల ఓ విమానాశ్రయం నుంచి ఆన్-12 కార్గో విమానం గురువారం ఉదయం క్రస్నోయాస్క్‌కు బయల్దేరింది. ఆ విమానంలో బంగారం వంటి ఖరీదైన లోహాలను తరలిస్తున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం తలుపు తెరుచుకోవడంతో అందులో నుంచి బంగారం కడ్డీలు వర్షంలా పడ్డాయి.
దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం నుంచి కిందపడ్డ 172 బంగారు కడ్డీలను గుర్తించారు. వీటి బరువు దాదాపు 3.4 టన్నులు ఉంటుందని తెలిపారు. విమానంలో మొత్తం 9.3 టన్నుల బంగారం ఉండగా అందులో కొంత కింద పడిపోయినట్లు వివరించారు. విమానం తలుపు సరిగా మూత పడకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment