
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం(శంషాబాద్ ఎయిర్‌పోర్టు)లోని రన్‌వేపై కొండచిలువ కలకలం సృష్టించింది. రన్‌వేపై శనివారం ఉదయం ఒక గంటపాటు అటూఇటూ తిరుగుతూ ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప‍్పలు పెట్టింది.
రన్‌వేపై నిలిపి ఉంచిన విమానం దగ‍్గరగా అది తిరుగుతుండడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వన‍్యప్రాణి సంరక్షణ సిబ‍్బంది వచ్చి కొండచిలువను పట్టుకుని జూపార్కుకు తరలించారు. గంటసేపు హల్‌చల్ సృష్టించిన కొండచిలువను అధికారులు పట్టుకోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

