రన్ వే పైకి నీళ్లు
Published Sun, Dec 4 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
తిరుపతి: శనివారం రాత్రి నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పైకి వర్షపు నీరు భారీగా చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై నిలిచిన నీళ్లను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నగరి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తిరుమలలో వర్షం కారణంగా భక్తులు ఇబ్బందిపడుతున్నారు.
Advertisement
Advertisement