రన్ వేపై కూలిపోయిన విమానం | Five die in Malta runway plane crash | Sakshi
Sakshi News home page

రన్ వేపై కూలిపోయిన విమానం

Published Mon, Oct 24 2016 4:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

రన్ వేపై కూలిపోయిన విమానం

రన్ వేపై కూలిపోయిన విమానం

వల్లెట్టా: మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ తెలియజేసింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వే కూలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement