
రన్‌వే మీద రైల్వే లైన్..
ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. అసలైనదే.. న్యూజిలాండ్‌లోని గిస్‌బార్న్ ఎయిర్‌పోర్టులో నిజంగానే ఇలా రైళ్లు వెళ్లివస్తుంటాయి. ఈ చిన్నస్థాయి ఎయిర్‌పోర్టు 160 హెక్టార్ల పరిధిలో ఉంది. ఇందులో ప్రధాన రన్‌వేతోపాటు మూడు చిన్న రన్‌వేలు ఉన్నాయి. ప్రధాన రన్‌వేకు మధ్యలో నుంచి ఈ రైల్వే లైను ఉంది. దీని వల్ల రైలు వచ్చినప్పుడు.. గేటు వద్ద మనమెలా ఆగుతామో.. అక్కడ విమానాలు కూడా ఆగుతాయట. లేదా విమానమే ముందు వెళ్లేటట్లుంటే.. రైలును ఆపుతారట. ఈ రెండింటినీ బాలెన్స్ చేయడంతోనే ఎయిర్‌పోర్టు సిబ్బందికి రోజంతా సరిపోతుందట.