రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతి | Plane Crash In Russia, Wagner Group Chief Prigozhin Reportedly Killed In Plane Crash - Sakshi
Sakshi News home page

Russia Plane Crash: రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతి

Published Thu, Aug 24 2023 4:57 AM | Last Updated on Thu, Aug 24 2023 9:20 AM

Plane crash in Russia, Wagner Group chief Prigozhin reportedly killed in plane crash - Sakshi

మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ కూడా మృత్యువాతపడ్డారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్‌ బిజినెస్‌ జెట్‌ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్‌ ప్రాంతంలో కుప్పకూలింది.

వివరాల ప్రకారం.. మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్‌ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్‌ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్​పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్​ ఫోర్స్​ కమాండర్​ సెర్గీ సురోవికన్​ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పుతిన్‌పై తిరుగుబాటు..
ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్‌.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్‌ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్‌ బృందాల తిరుగుబాటుకు తెరపడింది.

ఎవరీ ప్రిగోజిన్..?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్‌ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్‌ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది.

ఇది కూడా చదవండి: వీడియో: నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement