passingers killed
-
పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు
జంషెడ్పూర్/రాంచీ/చాయ్‌బసా/కోల్‌కతా: జార్ఖండ్‌లోని సెరాయ్‌కెరా–ఖర్సావాన్ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్‌ఈస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ చరణ్ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్ సింఘ్భమ్ డెప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం...ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్సు రైలు
న్యూజల్పాయ్గురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచిఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. త్రిపురలోని అగర్తలా నుంచి బెంగాల్‌లోని సీల్డాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక గార్డు కోచ్, రెండు పార్సల్ కోచ్‌లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికుల కోచ్‌లకు నష్టం వాటిల్లలేదు. ఉత్తర బెంగాల్లో న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. గూడ్సు రైలు లోకో పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డుతోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వేశాఖతోపాటు పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.రెడ్ సిగ్నల్ పడినా.. గూడ్సు రైలు లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉండొచ్చని, రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోకో పైలట్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లడంతో ఎక్స్‌ప్రెస్ రైలును వెనుకనుంచి ఢీకొట్టినట్లు భావిస్తున్నామని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే సింగిల్ ట్రాక్‌పై రెండు రైళ్లు అత్యంత సమీపంలోకి వచ్చేలా సిగ్నల్ ఎలా ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్ చివరి భాగంలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్‌లు పూర్తిగా పక్కకు ఒరిగిపోగా, మరో కోచ్ గాల్లోకి లేచి అలాగే వేలాడుతోంది. గూడ్సు రైలు ఇంజన్ దానికిందికి చొచ్చుకొచి్చంది. వేలాడుతున్న కోచ్‌ను అధికారులు తొలగించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మిగిలిన కోచ్‌లతో ఎక్స్‌ప్రెస్ రైలు ఘటనా స్థలం నుంచి కోల్‌కతా వైపు ప్రయాణం సాగించింది. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ రంగంలోకి దిగారు. లిఫ్ట్ అడిగి బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇదంతా మోదీ సర్కారు నిర్వాకం: కాంగ్రెస్ బెంగాల్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మోదీ పదేళ్ల పాలనలో రైల్వేశాఖ తల్లిదండ్రులు లేని అనాథగా మారిందని సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రైల్వే శాఖ గత వైభవాన్ని కోల్పోయిందన్నారు.ఆ మార్గంలో ‘కవచ్’ లేదు రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. అయితే, గౌహతి–ఢిల్లీ మార్గంలో ఈ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కాంచనజంగ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే మార్గంలో ఉంది.కొంపముంచిన టీఏ912 లెటర్! కాంచనజంగ రైలు ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం వెనుక గూడ్సు రైలు లోకో పైలట్ తప్పిదం లేదని తెలుస్తోంది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో కాంచనజంగ రైలును గూడ్సు రైలు ఢీకొట్టింది. అయితే, సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి ఈ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో రెడ్‌సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని లోకో పైలట్‌కు సూచించినట్లు వెల్లడయ్యింది. ఈ మేరకు రైల్వేశాఖ అంతర్గత నివేదిక ఒకటి వెలుగులోకి వచి్చంది. ఈ నివేదిక ప్రకారం.. రాణిపాత్ర స్టేషన్ మాస్టర్ టీఏ912 పేరిట లోకో పైలట్‌కు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ఏ సిగ్నల్ పడినా దాటుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అదే ట్రాక్‌పై మరో రైలు లేకపోతే సిగ్నల్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లడానికి టీఏ912 లెటర్ జారీ చేస్తుంటారని రైల్వేవర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ట్రాక్‌పై అంతకుముందే ఒక రైలు వెళ్లింది. మరో సెక్షన్లోకి ప్రవేశించింది. దాంతో ట్రాక్‌పై రైలు లేదన్న అంచనాతో స్టేషన్ మాస్టర్ టీఏ912 జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8.27 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసింది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ట్రాక్‌పై నిలిచిపోయింది. ఎందుకు నిలిచిందన్నది తెలియడంలేదు. గూడ్సు రైలు ఉదయం 8.42 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసి సరిగ్గా 8.55 గంటలకు కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఏడాది క్రితం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనను గుర్తుకుతెచి్చంది. -
పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
పెషావర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిట్–బల్టిస్తాన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. రావల్పిండి నుంచి గిల్గిట్ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ కూడా మృత్యువాతపడ్డారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్ బిజినెస్ జెట్ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో కుప్పకూలింది. వివరాల ప్రకారం.. మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్ ఫోర్స్ కమాండర్ సెర్గీ సురోవికన్ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్‌పై తిరుగుబాటు.. ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇది కూడా చదవండి: వీడియో: నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారు
షియా మైనారిటీలు ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 47 మందిని హతమార్చిన ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు పోలీస్ యూనిఫాంలో వచ్చి బస్సును అటకాయించడంతో కగారుపడ్డ డ్రైవర్ బస్సును పూర్తిగా నిలిపివేశాడు. దీంతో ఉగ్రవాదులు యధేచ్ఛగా కాల్పులు జరిపారని ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఒకరు చెప్పినట్లు పాక్ పోలీసులు పేర్కొన్నారు. నగర శివార్లలోని అల్- అజహర్ గార్డెన్ కాలనీలో నివసిస్తోన్న షియాలు ఉచిత బస్సు ద్వారా కరాచి నగరానికి వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తోన్న 60 మందిలో అత్యధికులు కూలీలు, రోడ్డు పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారే కావడం గమనార్హం. కాల్పులకు పాల్పడింది తామేనని తెహ్రీక్ - ఏ- తాలిబన్ సంస్థ ప్రకటించింది. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని షరీఫ్.. అధికారుల్ని ఆదేశించారు.