పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం | 20 killed in bus accident in Pakistan | Sakshi

పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

May 4 2024 5:24 AM | Updated on May 4 2024 5:24 AM

20 killed in bus accident in Pakistan

పెషావర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని గిల్గిట్‌–బల్టిస్తాన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. 

రావల్పిండి నుంచి గిల్గిట్‌ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్‌ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు.  డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement