gilgit-baltistan
-
పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
పెషావర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిట్–బల్టిస్తాన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. రావల్పిండి నుంచి గిల్గిట్ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద విరుచుకుపడ్డారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులు పూర్తిగా కంట్రోల్లోనే ఉన్నాయన్నారు. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయంటూ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్ పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని తెలిపారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్ఏసీ వెంబడి పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది. చైనా దళాలు భాతర భూభాగంలోకి ప్రవేశించాయనే వాదనలు పూర్తిగా నిరాధారమైనివి. ప్రస్తుతం చైనాతో కమాండర్ స్థాయి చర్చలు జరగుతున్నాయి. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో మాకు తెలీదు. కానీ మేం ప్రయత్నిస్తున్నాం అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని వివరాలను వెల్లడించలేం’ అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘1962 నుంచి 2013 వరకు ఏం జరిగింది అనే దాని గురించి వదిలేద్దాం. నేను దాని గురించి ఏం మాట్లాడను. ప్రస్తుతం మన దళాలు ఎల్ఏసీ వద్ద గొప్ప ధైర్యాన్ని చూపించాయి. చైనా సైన్యం మన భూభాగంలోకి ప్రవేశించారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. గల్వాన్ ఘర్షణ తర్వాత నేను మన సైనికులను కలిశాను. ప్రధానమంత్రి కూడా సైనికులను కలుసుకున్నారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేరు’ అన్నారు. (చదవండి: భగ్గుమన్న భారత్.. పీఓకే ఆక్రమణ..!) అలానే పీఓకేలో భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్‌కు తాత్కలిక ప్రాంతీయ హోదా ఇవ్వడానికి ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన మండి పడ్డారు. గిల్గిత్ బాల్టిస్తాన్, పీఓకే భారతదేశానికి చెందినది. దాని స్థితిలో ఎటువంటి మార్పు మాకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతుంది. టెర్రర్ గ్రూపులు కూడా ఇలానే ఉన్నాయి. ఆ కడుపుమంటతో ఈ చర్యలకు దిగింది అన్నారు. అలానే పుల్వామా దాడి విషయంలో కూడా ఇమ్రాన్‌పై మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి పాకిస్తానే కారణం అన్నారు. -
భగ్గుమన్న భారత్.. పీఓకే ఆక్రమణ..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వెంబడి చిచ్చు రాజేసేందుకు దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద గిల్గిత్-బాల్టిస్తాన్‌ను (జీబీ)ను దానికి వేదికగా చేసుకుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎత్తులు వేస్తున్నారు. భారత ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా గుడ్డెద్దు మాదిరిగా ముందుకు వెళ్తున్నారు. పూర్వ కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) తన చేతిలో తీసుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. భారత హెచ్చరికల్ని తుంగలో తొక్కి వివాదాస్పద ప్రాంతంలో పర్యటించిన ఇమ్రాన్.. అక్కడ ఎన్నికల నిర్వహిస్తున్నామని ప్రకటించి భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసిరారు. ఈ ప్రకటన ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొత్త వివాదాన్ని రాజేసింది. తక్షణమే వెళ్లిపోండి.. భారత్ హెచ్చరిక అవిభాజ్య కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం పాక్ ప్రభుత్వానికి లేదని భారత్ వాదిస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. హోదా మార్చడమే కాకుండా.. ఆక్రమిత ప్రాంతం (పీవోకే) నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ప్రకటించారు. ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన తరుణంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. గిల్గిత్–బాల్టిస్తాన్ తొలినుంచీ జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్‌గా గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రకటించడం కోసమే ఇమ్రాన్‌ఖాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. పాక్ కడుపుమంట.. భారత్‌పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయడంవల్ల పాక్‌కి ఏమాత్రం లాభం కూడా లేదు. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నాక గిల్గిత్ బాల్టిస్తాన్‌ను లద్దాఖ్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్‌ను దురాక్రమణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పీఓకే అంతా భారత్‌దే గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్‌కే చెందుతుందని స్పష్టం చేసింది. అయితే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరింత పట్టుసాధించింది. ఇక అవిభాజ్య భారత్‌లో భాగంగా ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను సైతం స్వాధీనం చేసుకోవాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే గిల్గిట్ బాలిస్తాన్‌పై తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఇదివరకే బహిరంగ ప్రకటనలు చేశారు. పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఆక్రమించుకోవడం తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కశ్మీర్ మ్యాప్‌లో జీబీని అంతర్భాగంగా చూపినట్లు అర్థమవుతోంది. మరి మోదీ-షా ద్వయం ఏ విధమైన వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. -
గిల్గిత్–బాల్టిస్తాన్ నుంచి వెళ్లిపోండి
న్యూఢిల్లీ: గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని భారత్ తప్పుపట్టింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చిచెప్పారు. ప్రొవెన్షియల్ హోదా పేరిట ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందన్నారు. హోదా మార్చడం కాదు.. ఆక్రమిత ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. గిల్గిత్–బాల్టిస్తాన్‌కు ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు మీడియా వెల్లడించింది. -
గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం
నక్కజిత్తుల మారి పాకిస్తాన్ మరోసారి భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆ ప్రాంత ప్రజలు పాక్ పాలన మాకొద్దు మొర్రో అన్నా వినిపించుకోవడం లేదు. చైనా అండదండలతో రెచ్చిపోతూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తోంది. భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోంది. దీంతో ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. చుట్టూ పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్ల మధ్య ఉన్న అందాల లోయ గిల్గిత్ బాల్టిస్తాన్. హాలీవుడ్ థ్రిల్లర్ వెర్టికల్ లిమిట్ వంటి సినిమా షూటింగ్‌లు జరిగిన భూతల స్వర్గం లాంటి ప్రాంతం. జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సిం«ధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్‌గా గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రకటించడం కోసం త్వరలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. భారత్‌పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా చేయడంవల్ల పాక్‌కి లాభం కూడా లేదు. భారత్‌తో తగాదాల కోసం చైనాతో చేతులు కలిపిన పాక్ అంతర్జాతీయ నిబంధనల్నీ తుంగలో తొక్కుతోంది. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకు న్నాక గిల్గిత్ బాల్టిస్తాన్‌ను లద్దాఖ్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్‌ను దురాక్ర మణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది. చైనా చెప్పు చేతల్లో... చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ఈ ప్రాంతం మీద నుంచే వెళుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సీపీఈసీకి గేట్ వేలాంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి కర్కోరమ్ పాస్ చేరుకోవడానికి భారత్ నిర్మించిన డర్బక్–షయోక్–డీబీఓ రహదారికి గిల్గిత్ బాల్టి స్తాన్‌తో సంబంధం ఉంది. పాకిస్తాన్, గిల్గిత్ బాల్టిస్తాన్లకి చైనా చేరుకోవాలంటే కరకోరమ్ మార్గం అత్యంత కీలకం. అందుకే ఆ రహదారి నిర్మాణం పూర్తయిన దగ్గర్నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలకు తెరతీసిన చైనా ఇప్పడు పాక్ వెనకాలే ఉండి గిల్గిత్ కుంపటిని రాజేస్తోంది. పీఓకే అంతా మాదే: భారత్ గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్‌కే చెందుతుందని స్పష్టం చేసింది. అదో బంగారు గని గిల్గిత్ బాల్టిస్తాన్ అందాలు కనువిందు చేసే పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అదొక ఖనిజాల గని. బంగారం, పచ్చలు వంటివి పుష్కలంగా లభించే ప్రాంతం. అయినప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. అనునిత్యం మిలటరీ ఉక్కు పాదాల కింద నలిగిపోతూ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందలేకపోయింది. ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన పర్వత శిఖరం కె–2 ఇక్కడే ఉంది. బౌద్ధ శిల్పాలకు నిలయం. జనాభా 12 లక్షల మంది వరకు ఉంటారు. షియా కమ్యూనిటీకి చెందినవారు ఎక్కువ. చరిత్రలోకి చూస్తే.. గిల్గిత్ బాల్టిస్తాన్‌కి మొదట్నుంచి ఒక దశ, దిశ లేదు. పాక్ తాను ఆక్రమించుకున్న కశ్మీర్ నుంచి 1949లో ఈ ప్రాంతాన్ని వేరు చేసి పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. 1963 మార్చిలో ఈ ప్రాంతంలో 5,180 చదరపు కి.మీ భూభాగాన్ని చైనాకి ధారాదత్తం చేసింది. 2009లో మళ్లీ గిల్గిత్ బాల్టిస్తాన్‌కు స్వయంపాలనాధికారం కల్పించింది. అప్పట్లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనల మేరకు కార్యనిర్వాహక తరహా ప్రభుత్వ ఏర్పాటు కావాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ పాక్ ఆ ప్రాంతంలో చైనా సహకారంతో భారీ ఎత్తున హైడల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి దిగింది. ఆ నిర్మాణాలను స్థానికులు వ్యతిరేకించడంతో ఆ ప్రాంతంపై తన పట్టును వదలకుండా ఉంచుకుంది. -
నవంబర్‌లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు
ఇస్లామాబాద్: నవంబర్ 15వ తేదీన గిల్గిత్– బాల్టిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్– బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావని భారత్ పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ..భారత్ అంతరంగిక విషయాలపై మాట్లాడేందుకు పాక్‌కు ఎలాంటి హక్కు లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్–బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పాక్ సీనియర్ దౌత్యాధికారికి నోటీసులు జారీ చేసింది. -
ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై వస్తున్న తప్పడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్లపై సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనది కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దీనిపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. గిల్గిట్-బాల్లిస్తాన్పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ట్విటర్ ఖాతా ధ్రువీకరించబడినది కాదు. 31,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఈ ఖాతా గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక ట్విటర్ ఖాతా కాదు’ అని ట్వీట్ చేసింది. కేంద్ర భూభాగానికి చేందిన లడఖ్ అధికారిక ట్విటర్ ఖాతాలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అవి @DIPR_Leh, @InformationDep4లు అధికారికమైనవని వెల్లడించారు. (భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) The Union Territory of Ladakh has two official Twitter handles ie.“DIPR Leh Ladakh, @DIPR_Leh” & “Information Department Kargil, @InformationDep4” & only these two Twitter handles are used by the administration of Ladakh to disseminate data & to make all important announcements. pic.twitter.com/ESxRlTpP6Z — DIPR Leh Ladakh (@DIPR_Leh) May 12, 2020 ఇక 31వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతా నకిలీదని.. అది షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనదిగా పరిగణించలేమని చెప్పింది. కాగా లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికారిక సమాచారం కోసం దయచేసి @DIPR_Leh & @ InformationDep4 ఖాతాలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని గాని, ముఖ్యమైన ప్రకటనలను వీటి ద్వారానే అధికారులు ప్రకటించడం లేదా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడిచింది. కాబట్టి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై, వాటికి సంబంధించి వస్తున్న సమాచారాలు, ప్రకటనలపై దేశ ప్రజలంతా జాగ్రత్త వహించాలని ట్వీట్లో పేర్కొంది. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
కశ్మీరీలకున్న స్వేచ్ఛ మాకు లేదా?!
ఇస్లామాబాద్ : అక్రమ పన్నుల గురించి పాకిస్తాన్ ప్రభుత్వంపై గిల్గిత్-బల్టిస్తాన్ ప్రజల పోరాటం ఉద్యమ రూపం దాలుస్తోంది. గిల్గిత్, బల్టిస్తాన్లపై పాకిస్తాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నిరసనకారుల తరఫున ప్రముఖ న్యాయవాది నాసిర్ ఖాన్ అండగా నిలిచారు. స్వతంత్రానంతరం జరిగిన పరిణాలతో జమ్మూ కశ్మీర్ అత్యంత వివాదాస్పద ప్రాంతంగా మారింది. అయినా కశ్మీరీలకు భారత్ ప్రభుత్వం అండగా నిలిచింది. రాజ్యంగ హక్కులను ప్రసాదించింది. ప్రజలకు పన్నులకు సబ్సిడీలకు అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. భారత్ మాదిరిగా పాకిస్తాన్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో గిల్గిత్, బల్టిస్తాన్ ప్రాంతాలు కూడా వివాదాస్పదంగా మిగిలాయి. ఈ ప్రాంతాల ప్రజలు స్వతంత్రం కోసం ఉద్యమిస్తే పాకిస్తాన్ అక్రమంగా అణిచివేస్తోంది. అంతేకాక ప్రజలకు రాజ్యంగా హక్కులను కూడా ఇవ్వడం లేదని నాసిర్ ఖాన్ అన్నారు. ప్రజలకు రాజ్యాంగ పౌరసత్వం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. చైనా పాకిస్తాన్ కారిడార్‌కు తాము పూర్తిగా వ్యతిరేకమని నాసిర్ ఖాన్ ప్రకటించారు. తమ భూభాగంలో చైనా రహదారి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
పాక్ వింత నిర్ణయం కోళ్లు, ఆవుల మీద పన్ను
-
కోళ్లు, ఆవులపై పాక్ వింత నిర్ణయం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్‌లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు. ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
‘పాకిస్తాన్ మెడలు వంచుతాం’
న్యూఢిల్లీ : పన్నుల పేరుతో తమపై మోయలేని భారాన్ని మోపుతూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంపై గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు శనివారం భగ్గుమన్నారు. చిన్న వ్యాపారులపై అధిక భారాన్ని మోపడంపై మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చే వరకూ నిరసనలతో హోరెత్తిస్తామని హెచ్చరించారు. స్కర్దు, గిల్గిత్ బాల్టిస్తాన్‌లలోని వ్యాపారులందరూ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై మనం పోరాడబోతున్నాం. కరచీ, క్వెట్టా, లాహోర్‌లలోని ప్రజలు, వ్యాపారులు ఉప్పెనై కదలి పాక్ ప్రభుత్వ మెడలు వంచాలని గుర్తు తెలియని నాయకుడు స్కర్దులో ఏర్పాటు చేసిన సమావేశం పేర్కొన్నట్లు తెలిసింది. గత నెలలో 22వ తేదీన బ్లాక్ డే సందర్భంగా గిల్గిత్ వ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు మారుమోగిన విషయం తెలిసిందే. 1947లో ఇదే రోజున పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌లో చొరబాటుకు పాల్పడి గిల్గిత్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. అందుకు నిరసనగా గిల్గిత్ ప్రజలు పాక్ ఆర్మీ తమ భూభాగాన్ని వదిలి వెళ్లిపోవాలని నిరసన చేపట్టారు. -
పాకిస్తాన్లో బ్లాక్ డే నిరసనలు
ముజఫరాబాద్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) : పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, రావల్కోట్, కోట్లీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం బ్లాక్ డే పాటించారు. పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు స్వతంత్రం కావాలని.. స్వేచ్ఛగా బతకాలని అభిలషిస్తున్నట్లు ప్రజలు స్పష్టం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం దేశ విభజన చేసి.. స్వతంత్రం ఇచ్చాక జమ్మూ కశ్మీర్ రాజ్యం అప్పటి రాజు స్వతంత్ర ఏలుబడిలో ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ సరిగ్గా 70 ఏళ్ల కిందట ఇదే రోజు (1947 అక్టోబర్22)న పాకిస్తాన్ కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 22న బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. రావల్కోట్లో పెద్ద ఎత్తున ప్రజలు బ్లాక్ డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తక్షణం ఆక్రమిత కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా కోట్లీ, హాజీరా ప్రాంతాల్లోనూ ప్రజలు నిరసనలు నిర్వహించారు. ముజుఫరాబాద్లోని నీలం బ్రిడ్జి దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.. పాక్ సైన్యం తమపై చేస్తున్న అకృత్యాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరారు. ఆ ఘటన మర్చిపోలేం ఆక్రమిత కశ్మీర్‌కు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్న జమ్మూ కశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(జేకేఎన్ఎస్ఎఫ్) నాయకుడు నాబీల్ ముఘల్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల కిందట రాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై పాక్ సైన్యం చేసిన అకృత్యాలను ఎన్నటికీ మర్చిపోలేమని చెప్పారు. చైనా సహకారంతో నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాక్ సైన్యం, ప్రభుత్వం మమ్మల్ని లూఠీ చేస్తోందని జమ్మూ కశ్మీర్ నేషనల్ ఇండిపెండెన్స్ అలయెన్స్ ఛైర్మన్ సర్దార్ మహమూద్ కశ్మీరీ స్పష్టం చేశారు. ఆజాద్ కశ్మీర్‌కు ప్రధాని, అధ్యక్షుడు ఉన్నా.. పాలన మాత్రం ఇస్లామాబాద్ నుంచే సాగుతోందని.. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. -
పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెట్టుబడులకు నో దారుణంగా దెబ్బతిన్న దౌత్యసంబంధాలు సియోల్: అంతర్జాతీయ సంస్థలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు దేశంలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి తాజాగా దక్షిణకొరియా నిరాకరించింది. ఈ ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడానికి గతంలో ఆసక్తిచూపిన కొరియా.. వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టలేమంటూ ఇప్పుడు చేతులెత్తేసింది. గిల్గిట్-బాల్టిస్తాన్, ఆజాద్ కశ్మీర్ వివాదాస్పద ప్రాంతాలు కావడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేక చట్టపరమైన సంక్లిష్టతలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలు వివాదాస్పదమే కాకుండా.. ఇవి అధికారికంగా పాకిస్థాన్ రాజ్యంలో చేరలేదు. దీంతో ఇక్కడ నివసించే ప్రజల పౌరసత్వం మొదలు అనేక విషయాల్లో సంక్లిష్టతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతాలు తమవేనని భారత్ స్పష్టం చేస్తూ వస్తున్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)పై సైతం భారత్ చాలా విస్పష్టంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీపీఈసీకి భారత్ అభ్యంతరంతో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ఇన్వెస్టర్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ముజఫరాబాద్‌లోని జీలం నదిపై 500 మెగావాట్ల చకోతి హతియన్ హైడ్రో ప్రాజెక్టు అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేయడానికి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ అయిన డీలిమ్ ఇండస్ట్రీయల్ కంపెనీ లిమిటెడ్ గతంలో ముందుకొచ్చినప్పటికీ.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంపై పునరాలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, కొరియా ఎగ్జిమ్ బ్యాంకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో డీలిమ్ సైతం వెనుకాడుతోంది. కొరియా ఆర్థిక సహకారంతో పీవోకేలో చేపట్టిన కోహలా జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి దక్షిణ కొరియా వెనుకకు తగ్గడంతో ఆ దేశంతో పాక్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌లో ఉన్న దక్షిణ కొరియా వాసులపై వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో దక్షిణకొరియా ఏమాత్రం తగ్గడం లేదు.