ఇస్లామాబాద్ : అక్రమ పన్నుల గురించి పాకిస్తాన్ ప్రభుత్వంపై గిల్గిత్-బల్టిస్తాన్ ప్రజల పోరాటం ఉద్యమ రూపం దాలుస్తోంది. గిల్గిత్, బల్టిస్తాన్‌లపై పాకిస్తాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నిరసనకారుల తరఫున ప్రముఖ న్యాయవాది నాసిర్ ఖాన్ అండగా నిలిచారు. స్వతంత్రానంతరం జరిగిన పరిణాలతో జమ్మూ కశ్మీర్ అత్యంత వివాదాస్పద ప్రాంతంగా మారింది. అయినా కశ్మీరీలకు భారత్ ప్రభుత్వం అండగా నిలిచింది. రాజ్యంగ హక్కులను ప్రసాదించింది. ప్రజలకు పన్నులకు సబ్సిడీలకు అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. భారత్ మాదిరిగా పాకిస్తాన్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో గిల్గిత్, బల్టిస్తాన్ ప్రాంతాలు కూడా వివాదాస్పదంగా మిగిలాయి. ఈ ప్రాంతాల ప్రజలు స్వతంత్రం కోసం ఉద్యమిస్తే పాకిస్తాన్ అక్రమంగా అణిచివేస్తోంది. అంతేకాక ప్రజలకు రాజ్యంగా హక్కులను కూడా ఇవ్వడం లేదని నాసిర్ ఖాన్ అన్నారు. ప్రజలకు రాజ్యాంగ పౌరసత్వం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. చైనా పాకిస్తాన్ కారిడార్‌కు తాము పూర్తిగా వ్యతిరేకమని నాసిర్ ఖాన్ ప్రకటించారు. తమ భూభాగంలో చైనా రహదారి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment