పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్చివెళ్లారు
షియా మైనారిటీలు ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 47 మందిని హతమార్చిన ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు పోలీస్ యూనిఫాంలో వచ్చి బస్సును అటకాయించడంతో కగారుపడ్డ డ్రైవర్ బస్సును పూర్తిగా నిలిపివేశాడు. దీంతో ఉగ్రవాదులు యధేచ్ఛగా కాల్పులు జరిపారని ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఒకరు చెప్పినట్లు పాక్ పోలీసులు పేర్కొన్నారు.
నగర శివార్లలోని అల్- అజహర్ గార్డెన్ కాలనీలో నివసిస్తోన్న షియాలు ఉచిత బస్సు ద్వారా కరాచి నగరానికి వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తోన్న 60 మందిలో అత్యధికులు కూలీలు, రోడ్డు పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారే కావడం గమనార్హం. కాల్పులకు పాల్పడింది తామేనని తెహ్రీక్ - ఏ- తాలిబన్ సంస్థ ప్రకటించింది. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని షరీఫ్.. అధికారుల్ని ఆదేశించారు.