భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం | Plane Crashes On Car In Florida, USA, Two Dead | Sakshi
Sakshi News home page

రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం

Published Tue, Mar 16 2021 6:12 PM | Last Updated on Tue, Mar 16 2021 6:54 PM

Plane Crashes On Car In Florida, USA, Two Dead - Sakshi

వాషింగ్టన్‌: రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఓ విమానం కూలిపోయింది. కారుపై కూలడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సంభవించింది. 

దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం నుంచి సింగిల్‌ ఇంజన్‌ ఉన్న ఓ చిన్న విమానం టేకాఫ్‌ తీసుకుంది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి పెంబ్రోక్‌ పైన్స్‌లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దహనమయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆలోపే మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement