తిరువనంతపురం : కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉండటం, రన్‌వేకు రెండు వైపులా లోయలు ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. దీనిపై తాము అనేకసార్లు సంబంధిత అధికారులకు విజ‍్ఙప్తి చేసిన వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. విమానాశ్రయ రన్‌వే వద్ద సరైన చర్యలు తీసుకోకపోతే శుక్రవారం కోళీకోడ్‌లో జరిగిన సంఘటన లాంటిదే భవిష్యత్తులో జమ్మూకశ్మీర్, పాట్నా విమానాశ్రయాల్లో సంభవించే ప్రమాదం ఉందని వాయు భద్రతా నిపుణులు కెప్టెన్ మోహన్ రంగనాథన్ హెచ్చరించారు. (కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్ స్వాధీనం)
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భద్రతా సలహా కమిటీలో రంగనాథన్ సభ్యుడిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందటే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోళీకోడ్ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తాను ఒక నివేదికను సమర్పించినట్లు తెలిపారు. రంగనాథన్ మాట్లాడుతూ.. ‘నా హెచ్చరికను విస్మరించారు. నా అంచనాకు తగ్గట్లే అది ఇప్పుడు జరిగింది. నా అభిప్రాయంలో ఈ ఘటన ప్రమాదం కాదు. హత్య!. తమ సొంత భద్రతా చర్యల్లోనే సమస్యలు ఉన్నాయి. కోళీకోడ్ విమానశ్రయం టేబుల్ టాప్ రన్‌వే చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉంది. అందువల్ల అక్కడ ఎక్కువ భద్రతా చర్చలు అవసరం’అని తెలిపారు. కోళీకోడ్ విమనాశ్రయం రన్‌వే చివరలో 70 మీటర్ల డ్రాప్ ఉంది. మంగళూరులో ఇది 100 మీటర్లు ఉంది. ఒక విమానం అదుపు తప్పితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. సరిగ్గా ఇలాగే జమ్మూ, పాట్నాలో కూడా జరగవచ్చు. ఈ రెండు చోట్ల కూడా సరైన భద్రత చర్యలు లేవు’ అని తెలిపారు. (కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు)
కోళీకోడ్ విమానశ్రయంలోని టేబుల్ టాప్ మిమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌షాట్ అవ్వడంతో రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఇంటి ఘటనే 2010లో మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో విమానం నుంచి మంటలు రావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు)
Comments
Please login to add a commentAdd a comment