సాక్షి, తిరువనంతపురం : కేరళ విమాన ప్రమాద విషాదానికి తోడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్నవారిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలతో ప్రయాణికులను తరలిస్తున్నారు. కానీ శుక్రవారం నాటి కోళీకోడ్ విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన రేపింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం)
మృతుల్లో ఒకరికి కరోనా సోకినట్టుగా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ప్రకటించారు. దీంతో ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. వీరి వివరాలను సేకరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. (ఆయన ధైర్యమే కాపాడింది!)
My heart goes out to the families & friends of the 18 people who lost their lives in the air accident involving @FlyWithIX Flight IX-1344 in Kozhikode last evening & offer my heartfelt condolences.
Reasons for the mishap are being investigated. pic.twitter.com/awEGpU9EmK
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 8, 2020
మరోవైపు కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి,కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్, కేంద్ర మంత్రి వి మురళీధరన్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment