California: Died Two in Plane Hits Houses In US - Sakshi
Sakshi News home page

ఇళ్ల మీద కూలిన విమానం.. ఇద్దరు మృతి

Published Tue, Oct 12 2021 8:15 AM | Last Updated on Tue, Oct 12 2021 12:47 PM

Some People Died In Plane Hits Houses In USA California - Sakshi

వాషింగ్టన్‌/లాస్‌ ఏంజెల్స్‌: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. విమానం ఒకటి ఇళ్ల మీద కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇళ్లతో పాటు.. పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఫాక్స్‌ ఐ సాన్‌ డియాగో రిపోర్ట్‌ ప్రకారం ఆరు సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ ట్విన్ -ఇంజిన్ సెస్నా 340, అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత కాలీఫోర్నియా చేరుకున్న విమానం.. ఉన్నట్టుండి అక్కడ ఉన్న ఇళ్ల మీద కూలిపోయింది. 
(చదవండి: తాలిబన్లతో డీల్‌.. మెలిక పెట్టిన అమెరికా)

ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోగా.. ఇద్దరు మరణించారు. పక్కనే ఉన్న డెలివరీ ట్రక్‌ కూడా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

చదవండి: భయానకం: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement