కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న అత్తాకోడళ్లు | Daughter in law died and mother in law injured in suicide attempt | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న అత్తాకోడళ్లు

Published Thu, Aug 6 2015 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

Daughter in law died and mother in law injured in suicide attempt

కర్నూలు : కుటుంబ కలహాలతో అత్తాకోడళ్లు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటనలో కోడలు మృతి చెందగా.. అత్త మాత్రం పూర్తిగా కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది. అత్తాకోడళ్ల సుబ్బులమ్మ, మహాదేవి మధ్య తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో గురువారం ఉదయం జరిగిన గొడవలో అత్త సుబ్బులమ్మ(48), కోడలు మహాదేవి(25) కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి మహాదేవి మృతి చెందింది. సుబ్బులమ్మను మాత్రం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement