విజయదుర్గకాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుడు మృతిచెందారు.
వైఎస్సార్ జిల్లా: తల్లీకుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన వైఎస్‌ఆర్ జిల్లాలోని విజయదుర్గకాలనీలో శనివారం చోటుచేసుకుంది. కోడలు, మనవడు మృతిచెందిన విషయం గుట్టుచప్పుడు కాకుండా అత్తంటి వారు ఖననం చేసినట్టు వారి తరపు బంధువులు ఆరోపించారు.
తల్లీ కుమారుడు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.