మా పొలంలో గేదెలను ఎందుకు వదిలావ్ అంటూ కోపంతో..
సాక్షి, దోమ( వికారాబాద్): భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాయాదులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన ఎండీ అస్లాం శనివారం ఎప్పటిలాగే పొలానికి వెళ్తుండగా తమ పొలంలో గెదేలను ఎందుకు వదిలావని అతని దాయదులైన కలీం, ఆఫ్రీద్, జాహంగీర్బీ స్పింగర్లతో అతనిపై దాడికి పాల్పడ్డారు. పాత కక్షలతోనే వారు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు అస్లాం ఆదివారం దోమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రమేష్ తెలిపారు.
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. ఉరేసుకుని ఆత్మహత్య
మర్పల్లి: జీవితపై విరక్తి చెందిన ఓ మహిళ ఉరేసుకోని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ కూతురు నవనీత (22)ను మూడు సంవత్సరాల క్రితం కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. నా లుగు నెలల క్రితం భర్త గోవర్ధన్ కరోనా బా రిన పడి మృతి చెందాడు. అప్పటినుంచి నవనీత పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉండేది. ఈ నేపథ్యంలో భర్త మరణాన్ని జీర్ణించుకోలేని నవనీత జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. అన్న న వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను తెలిపాడు.