
మహబూబాబాద్ అర్బన్: కులం పేరుతో దూషించి, నన్ను నా కుమారులను ఇద్దరిని మా అత్తా, బావలు ఇంటి నుంచి గెంటేస్తున్నారని పెసర సునీత అనే మహిళ తెలిపింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 31వ వార్డు హన్మంతునిగడ్డ గణేష్‌నగర్‌లో పెసర సునీత అత్తారింటి ఎదుట మృతి చెందిన భర్త(రాము) ఫొటోతో పాటు తన ఇద్దరు కుమారులతో శుక్రవారం ధర్నా చేపట్టింది. 2005లో రాము, సునీత కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే రాము నవంబర్ 7, 2021న టీబీ వ్యాధితో మృతి చెందాడు. ఈ క్రమంలో వచ్చే ఆస్తులు ఇవ్వకుండా కులంపేరుతో దూషిస్తూ ఇంట్లో నుంచి వెల్లగొట్టారు. 26– 11– 2021న పోలీస్‌స్టేషన్‌లో అత్తా, బావలు బెదిరిస్తున్నారని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఏమైన ఉంటే పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అని అన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment