
సాధారణంగా ఉద్యోగాలు, స్థలాల అమ్మకాల కోసం ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఓ యువతి ఏకంగా బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రకటన తన కోసం కాదట వారి అత్త గారి కోసమని తెలిపింది. కాకపోతే ఇందులో కొన్ని కండీషన్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వింత ప్రకటన ఓ రేంజ్‌లో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆ ప్రకటనలో ఏముంది.. ఆ కండీషన్స్ ఏంటి!
న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఓ కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలని తెలుపుతూ.. అందుకు సదరు వ్యక్తికి అర్హతలుగా 40 నుంచి 60 ఏళ్ల , వీటితో పాటు డ్యాన్స్ వచ్చుండాలని, చక్కని మాటకారిగా ఉండాలని పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. కేవలం రెండు రోజులకు మాత్రమే ఆ వ్యక్తి తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్‌గా వ్యవహరిస్తే సరిపోతుందని కూడా ఈ ప్రకటనలో వెల్లడించింది. అందుకు గాను సుమారు 960 డాలర్లు( సుమారు రూ. 72000) చెల్లించనున్నట్లు తెలిపింది. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే.. తాము ఓ స్నేహితురాలి వివాహానికి హాజరుకావాల్సి ఉందని, అక్కడ తన అత్తగారు బోర్‌గా ఫీల్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ బాయ్ ఫ్రెండ్‌ను ఆమెకు తోడుగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఆ కోడలు తెలిపింది.
రెండు రోజులకు సుమారు వెయ్యి డాలర్లు అంటే మంచి ఆఫరే కాబట్టి దీనికి చాలా మంది అప్లై కూడా చేసుకుంటున్నారట. వీరి నుంచి వాళ్ల అత్తకు ఓ బాయ్ ఫ్రెండ్‌ను ఎలా సెలక్ట్ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు కొందరు ఇలాంటి ప్రకటనలు కూడా ఉంటాయా అని నవ్వుతుంటే మరి కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటు కొట్టి పారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment