భార్య, అత్తా కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు | Woman attemps murder on her husband | Sakshi
Sakshi News home page

భార్య, అత్తా కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు

Published Sun, Sep 18 2016 9:08 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Woman attemps murder on her husband

సారంగాపూర్ (కరీంనగర్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్త కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఇరగదిండ్ల గంగయ్య(30) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మరోసారి వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో విసిగిపోయిన భార్య రజిత, ఆమె తల్లితో కలిసి గంగయ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement