రంగారెడ్డి (బషీరాబాద్) : కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన మానెప్ప, పవిత్రమ్మలు భార్యాభర్తలు. పది సంవత్సరాల క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ కోడలు పవిత్ర, తన అత్త,మామ,భర్తపై కేసు పెట్టింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు.
కాగా వీరు కేసుల నుంచి బయటపడేందుకు సగం ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా మానెప్ప ఇంట్లో చెప్పాపెట్టకుండా వేరే ఊరికి చెందిన మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పవిత్ర మరోసారి వీరిపై కేసు పెట్టింది. దీంతో కేసుల బాధ భరించలేక అత్త మాణిక్యమ్మ(50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోడలు కేసు పెట్టిందని అత్త ఆత్మహత్య
Published Mon, Aug 24 2015 5:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement