
అల్లుడు నాగరాజు, అత్త సౌభాగ్య (ఫైల్)
సాక్షి, బెంగళూరు: మద్యం మత్తులో అల్లుడు, అత్తను సుత్తితో కొట్టి హత్యచేశాడు. ఈ ఘటన బెంగుళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆరేళ్ల క్రితం నాగరాజు అనే వ్యక్తితో సౌభాగ్య (50) కుమార్తె భవ్యశ్రీకి పెళ్లి చేశారు. నాగరాజు, భవ్యశ్రీ దంపతులకు ఐదేళ్లు కుమారుడు ఉన్నారు. డ్రైవరుగా పనిచేస్తున్న నాగరాజు మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడేవాడు. భర్త వేధింపులను తట్టుకోలేక భవ్యశ్రీ మూడేళ్ల క్రితం హెచ్‌ఏఎల్ సంజయనగరలో ఉన్న పుట్టింటికి వెళ్లింది.
మద్యం మత్తులో ఉన్న నాగరాజు భార్య కావాలంటూ ఈ నెల 12 తేదీన భార్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. అత్త సౌభాగ్య, కుటుంబసభ్యులు మందలించి పంపేశారు. మరుసటిరోజున నాగరాజు సుత్తితో వచ్చి సౌభాగ్య తలపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సౌభాగ్యను స్థ్దానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ క్రితం మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నహెచ్‌ఏఎల్ పోలీసులు నాగరాజును అరెస్ట్ చేశారు.
చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment