గుంటూరు(నరసరావుపేట): భర్తను కోల్పోయిన కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటి వారు రాక్షసంగా ప్రవర్తించారు. బాధితురాలి కథనం ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం ములకలూరుకు చెందిన ఒక వితంతువు పట్ల మామ, ఇద్దరు మరుదులు కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మామ ప్రవర్తనపై ఏడాదికిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలనీ పెద్దలు రాజీ కుదిర్చి ఇకమీదట ఇలా జరగదని చెప్పడంతో ఆమె నమ్మింది. స్నానం చేస్తుండగా ఫొటోలు తీశామని, వాటిని బయటపెడతామంటూ మరుదులు కొద్ది రోజులుగా ఆమెను బెదిరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమెపై రెండో మరిది అత్యాచారం కూడా చేశాడు. తరువాత మామ, మరుదులు ఈ విషయం గురించి బయట చెప్తే బ్లేడుతో కోసి చంపుతామని బెదిరించారు. ఆదివారం ఉదయం కూడా ఆమెపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి మామ, మరుదులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కోడలిపై అత్తింటి వారి పైశాచికత్వం
Published Sun, Jul 12 2015 10:14 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement