ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..? | Prabhas Next With Top Producer Dil Raju | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

Published Wed, Jun 19 2019 12:26 PM | Last Updated on Wed, Jun 19 2019 12:26 PM

Prabhas Next With Top Producer Dil Raju - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈమూవీ తరువాత రాధకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్‌.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. జాన్‌ తరువాత చేయబోయే సినిమాపై కూడా ప్రభాస్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు ప్రభాస్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

గతంలో ప్రభాష్ హీరోగా మున్నా, మిస్టర్‌ పర్ఫెక్ట్‌ లాంటి సినిమాలను తెరకెక్కించిన దిల్ రాజు హ్యాట్రిక్‌ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాహో సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను కూడా దిల్ రాజు తీసుకున్నరాన్న ప్రచారం జరుగుతోంది.  ప్రభాస్‌ కూడా దిల్ రాజుతో కలిసి వర్క్ చేస్తే సుముఖంగానే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement