
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
సాహో సినిమా నైజాం, వైజాగ్ రైట్స్‌ను దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారట. దాదాపు 45 కోట్ల వరకు ఈ రైట్స్ కోసం ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మీడియా సర్కిల్స్‌లో మాత్రం ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.