
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే......అని బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో కలిసి ప్రభాస్ ప్రేమరాగం తీశారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీతదర్శకుడు స్వరాలందించారు. ఇటీవల ‘సైకో సయ్యా’ పాటను విడుదల చేసిన ‘సాహో’ టీమ్ తాజాగా ఈ సినిమాలోని ‘ఏ చోట నువ్వున్నా?’ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.
‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే... నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అన్న లిరిక్స్ ఉన్న ఈ పాట టీజర్ శ్రోతలను అలరిస్తోంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. గురు రాంధ్వా సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అదించారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఆలపించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 2న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment