
ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది ‘సాహో’ టీం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో... బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త యాక్షన్ పోస్టర్‌ను శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ప్రభాస్, శ్రద్ధా ఇద్దరూ తుపాకులతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకు మించిన భారీ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్, ఎవలీన్ శర్మ, అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్ బాగ్చీ, జిబ్రాన్ సంగీతం అందించారు. మొదట ఈ చిత్రాన్ని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినా తరువాత ఆగష్టు 30కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
— Shraddha (@ShraddhaKapoor) July 25, 2019