
హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది.
ఫేస్‌బుక్ మాత్రమే వాడుతూ సోషల్‌మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని హీరో ప్రభాస్, అభిమానుల కోరిక మేరకు ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. 'హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి' అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో బాహుబలిలో కత్తి తిప్పుతున్న ఫోటోను ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టిన తర్వాత, బాహుబలి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ రేపు(మంగళవారం) అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకీ ప్రభాస్ ప్రకటించబోయే సంచలన విషయం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పోస్ట్‌కు హీరో రానా కూడా బదులిచ్చారు. నువ్వు నిజంగానే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉన్నావా, నువ్విచ్చే సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ హీరో రానా కామెంట్‌పెట్టాడు.
ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపూ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తారా లేకపోతే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇచ్చే సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ప్రభాస్ అభిమానులకు రేపు ఓ సర్‌ప్రైజ్