ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌! | 10 Films Release On Same Day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

Published Tue, Aug 20 2019 12:14 PM | Last Updated on Tue, Aug 20 2019 2:53 PM

10 Films Release On Same Day - Sakshi

ఈ శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున సాహో మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్ని ఆగస్టు 23న రిలీజ్‌కు క్యూ కట్టాయి. దీంతో ఒకే రోజు 10 సినిమాలో బాక్సాఫీస్‌ బరిలో తలపడుతున్నాయి. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు రిలీజ్‌ అవుతున్నట్టుగా కూడా ప్రేక్షకులకు తెలియదు.

తమిళ్‌లో సక్సెస్‌ అయిన కనా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమాలపై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్‌, ఉండిపోరాదే, నివాసి, హవా లాంటి సినిమాల సందడి మీడియాల కాస్త కనిపిస్తుంది. నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే విషయంలో ఆ సందడి కూడా కనిపించటం లేదు. మరి ఈ పది సినిమాల్లో ప్రేక్షకులు ఎన్ని సినిమాలను ఆదరిస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement