Kousalya Krishnamurthy
-
సినిమాల్లో వీరు పాసయ్యారు
ఇండస్ట్రీ సముద్రం లాంటిది. కొత్త నీరు ఎప్పటికప్పుడు సముద్రంలో చేరినట్టే, ఇండస్ట్రీలోనూ కొత్త ముఖాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రవాహం సాగుతుంటుంది. ఈ ప్రయాణంలో ప్రామిసింగ్‌గా కొందరు మాత్రమే అనిపిస్తారు. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెరిసిన కొత్తవాళ్ల సంఖ్య అభినందనీయంగా లేదు. గత ఏడాది కొత్త దర్శకులు నెలకో వారం చొప్పున మెరిశారు. ఈసారి అదీ కనిపించలేదు. హీరోహీరోయిన్లు విషయంలోనూ అంతే. అలా ఈ ఏడాది తెలుగులో పరిచయమైనవాళ్లల్లో ఫస్ట్ టెస్ట్‌లో పాస్ అయి, ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులకు బాగా రీచ్ అయినవారి గురించి మాట్లాడుకుందాం. హీరోలిద్దరే! ► డిటెక్టివ్ అనేవాడికి తన మీద తనకి నమ్మకం, కొంచెం ఓపిక ఉండాలి అనేది ఏజెంట్ ఆత్రేయ ఫిలాసఫీ. నవీన్ పొలిశెట్టి జర్నీని గమనిస్తే ఇలాంటి థియరీనే తన లైఫ్‌లోనూ పాటించినట్టున్నారు. యూట్యూబ్ వీడియోలతో మొదలయి, సినిమాల్లో అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూశారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హీరోగా పరిచయం అయ్యారు నవీన్ పొలిశెట్టి. ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం అందుకున్న సినిమా ‘ఏజెంట్.. ఆత్రేయ’. వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపించారు నవీన్. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’లో నటిస్తున్నారు. ► అన్నయ్యేమో యూత్ క్రేజీ స్టార్. ఏం చేసినా సెన్సేషనే. ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలో పరిచయం అయ్యేటప్పుడు అంచనాలుండటం సహజం. ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ.. బ్రదర్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ‘దొరసాని’ అంటూ ఓ కొత్త తరహా ప్రేమకథను ప్రేక్షకులకు చూపించారు. స్టార్ అన్నయ్య తమ్ముడు కాబట్టి ఎంట్రీ ఈజీ అయింది. ప్రస్తుతం రెండు, మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు ఆనంద్. ఇలా ఈ ఏడాది పరిచయమైన హీరోల్లో ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అయినది ఈ ఇద్దరే అని చెప్పొచ్చు. ఆ ఆరుగురు... ఈ ఏడాది చాలామంది డైరెక్టర్లు పరిచయం అయ్యారు. అయితే సక్సెస్ పర్సంటేజ్ పరంగా ఎక్కువగా రీచ్ అయినవారి గురించి ప్రస్తావించాలంటే.. ‘డియర్ కామ్రేడ్’తో భరత్ కమ్మ, ‘ఎవరు’తో వెంకట్ రామ్‌జీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో స్వరూప్ ఆర్ఎస్జే, ‘దొరసాని’తో కేవీఆర్ మహేంద్ర, ‘మల్లేశం’తో రాజ్.ఆర్, ‘రాజావారు రాణిగారు’తో రవికిరణ్ దర్శకులుగా పరిచయం అయ్యారు. హిట్ కొట్టారు. నెక్ట్స్ సినిమా ఏం చేస్తారు? అనే ఆలోచన ప్రేక్షకుడిలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. లైంగిక వేధింపులు, లైంగిక హింస.. ప్రస్తుతం మాట్లాడాల్సిన విషయాలు. అవగాహన కలిగించాల్సిన సమయం. ఇలాంటి కథతో ‘డియర్ కామ్రేడ్’ కథను చెప్పారు భరత్ కమ్మ. ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్‌కు పంపే సినిమాల లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’ కూడా ఉండటం విశేషం. ‘డిటెక్టివ్’ కథలు తెలుగులో వచ్చి చాలా కాలం అయింది. అలాంటి సీరియస్ డిటెక్టివ్ కథకు హ్యూమర్ జత చేసి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో బాక్సాఫీస్‌కి కితకితలు పెట్టారు స్వరూప్. ఈ అల్లరి ఏజెంట్ అందరినీ నవ్వించి, అందరికీ నచ్చేశాడు. ఏజెంట్‌ను ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచన ఉందని దర్శకుడు ఓ సందర్భంలో తెలిపారు. ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి తెలంగాణ ప్రాంతంలో 1980లలో జరిగే అపురూపమైన ప్రేమకథగా ‘దొరసాని’ చిత్రాన్ని తెరకెక్కించారు మహేంద్ర. ఈ కథను మూడేళ్లు పాటు సుమారు 42 వెర్షన్లు రాసినట్టు దర్శకుడు పేర్కొన్నారు. కథ 1980లలో జరిగేట్టు చూపించడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చిన్న బడ్జెట్ సూపర్ స్టార్ అడివి శేష్ ఈ ఏడాది మరో కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్వెజిబుల్ గెస్ట్’ కథను తీసుకుని అద్భుతంగా మన భారతీయతను జోడించి ‘ఎవరు’గా తీశారు దర్శకుడు వెంకట్ రామ్ జీ. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకుల గోళ్లు ఏమాత్రం మిగలకుండా పూర్తిగా కొరికేసుకునే రేంజ్ థ్రిల్లర్ తీయడంలో పక్కాగా సక్సెస్ అయ్యారు రామ్‌జీ. మరో మీడియమ్ బడ్జెట్ హిట్‌ను అడవి శేష్ హిట్ లిస్ట్‌లోకి అందించారు రామ్‌జీ. ఎన్ని కమర్షియల్ సినిమాలొచ్చినా, కాన్సెప్ట్ చిత్రాలొచ్చినా మన కథలు, మన సంస్కృతులను గుర్తు చేసే సినిమాలు ప్రత్యేకం.. అవసరం. అమ్మ కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టిన సూపర్ హీరో ‘చింతకింది మల్లేశం’ జీవితకథను ‘మల్లేశం’గా తెరకెక్కించారు రాజ్ ఆర్. నిజాయతీగా కథను చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంది. కొత్త దర్శకులకు ప్రియమైన జానర్లో ప్రేమకథ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పాత ఫార్ములాను ఎంత కొత్తగా చెప్పడం అనేదాన్ని బట్టి దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది. ‘రాజావారు రాణిగారు’ అనే పల్లెటూరి ప్రేమకథను కనువిందుగా చూపించారు దర్శకుడు రవికిరణ్. దర్శకుల్లో ఈ ఆరుగురి రీచ్ బాగుందనొచ్చు. మెరిసిన నాయికలు తెలుగు మూలాలున్న అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్. తమిళంలో మంచి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కణా’. ఈ చిత్రం రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో తెలుగులో పరిచయం అయ్యారామె. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తి చేసి, నానీతో ‘టక్ జగదీష్’ కమిట్ అయ్యారు. కన్నడంలో మంచి ఫెర్ఫార్మర్ అనిపించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో ‘జెర్సీ’తో ఎంట్రీ ఇచ్చారు. నాని పాత్రకు దీటుగా నటించి ఆడియన్స్‌లో ఆసక్తి కలిగించారు. ప్రస్తుతం ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేశారామె. రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మికా రాజశేఖర్ ‘దొరసాని’లో మంచి నటనను కనబరిచారు. అలానే ‘గద్దలకొండ గణేష్’లో మృణాలినీ రవి, ‘గ్యాంగ్ లీడర్’లో ప్రియాంకా మోహనన్ ప్రేక్షకుడి అటెన్షన్ రాబట్టగలిగారు. పేరు రావడం.. రాకపోవడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. సినిమా హిట్ వారి వారి కెరీర్‌ని నిర్ణయిస్తుంది. ఈ ఏడాది పెద్దగా గుర్తింపు తెచ్చుకోనివారికి 2020 కలిసొస్తుందేమో. అలాగే ఈ ఏడాది ఎక్కువగా రీచ్ అయినవారు వచ్చే ఏడాది ఇంకా విజయాలు చూస్తారేమో. – గౌతమ్ మల్లాది -
‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ చూసిన పీవీ సింధు
-
కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం
‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం’ లాంటి మంచి సినిమాలు చేశాను. మంచి కథలు దొరకడం కష్టమవుతున్న ఈ మధ్యకాలంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఒక గొప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్’’ అని భీమనేని శ్రీనివాసరావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు చెప్పిన విశేషాలు. ► ‘కౌసల్య కృష్ణమూర్తి’కి వచ్చినన్ని అభినందనలు నా గత సినిమాలకు రాలేదు. మా చిత్రం నచ్చడంతో మీడియా మిత్రులు కూడా సొంత సినిమా అనుకుని సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాకు 100 శాతం కనెక్ట్ అయ్యారు. చాలా మంది కాలేజ్ విద్యార్థులు ఫోన్ చేసి, ఈ సినిమా మాకు ఓ స్ఫూర్తిలా ఉందని అంటున్నారు. ► ఈ మధ్య కాలంలో ‘మజిలీ, జెర్సీ’ లాంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే మాది ఫిమేల్ సెంట్రిక్ మూవీ. క్రికెటర్‌గా ఎదగాలనే ఒక అమ్మాయి తపనను చూపిస్తూనే, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ని చూపించాం. దానికి సమాంతరంగా రైతుల సమస్యలను చూపించాం. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ► ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డిగారు కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూశారు. వారికి సినిమా విపరీతంగా నచ్చడంతో నన్ను, కె.ఎస్ రామారావుగారిని అభినందించారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేష్, కార్తీక్ రాజు నటనను కొనియాడి, ఫోన్లో అభినందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వంటి గొప్ప బేనర్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కె.ఎస్ రామారావుగారికి, కె.ఎ వల్లభ గారికి థ్యాంక్స్. ► ప్రేక్షకులకు కథ నచ్చితే అది రీమేక్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? అని చూడకుండా ఆదరిస్తున్నారు.. హిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటి వరకూ ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాను. కాలంతో పాటు మనం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీసినప్పుడే విజయం సాధించగలం. ► స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాణ్ణి. ఆ అనుభవంతో సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌లో ‘అశ్వద్ధామ’ సినిమాలో ఓ పాత్ర చేశా. ఆర్. నారాయణమూర్తిగారి ‘ఆలోచించండి’ సినిమాలో సెకండ్ హీరోగా చేశా. ‘కుదిరితే కప్పు కాఫీ, కెరటం’ వంటి చిత్రాల తర్వాత ‘కౌసల్య కృష్ణమూర్తి’లో బ్యాంకు మేనేజర్ పాత్ర చేశా. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్ రోల్ అయినా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇకపైన కూడా మంచి పాత్రలొస్తే నటిస్తా. ► ఏ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి. నాకు ‘సుడిగాడు’ అలాంటి సినిమా. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. నేను, ‘అల్లరి’ నరేష్ కూడా ‘సుడిగాడు 2’ మీద చాలా ఆసక్తిగా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ
టైటిల్ : కౌసల్య కృష్ణమూర్తి జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, శివ కార్తీకేయన్, కార్తీక్ రాజు తదితరులు సంగీతం : దిబు నైనన్ థామస్ నిర్మాత : కేఎ వల్లభ దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు తమిళంలో బిజీ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్యా రాజేష్, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సరైన చిత్రంతో ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూశాను.. అందుకే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. తమిళంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా రూపొందించిన ‘కణా’ ను మళ్లీ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ చేశారు. మరి ఈ చిత్రం ఐశ్వర్యకు తెలుగులో మంచి విజయాన్ని అందించిందా? టాలీవుడ్‌లోనూ ఐశ్వర్యా సత్తాచాటిందా? అనేది చూద్దాం. కథ : ఇరగవరం అనే గ్రామంలో ఉండే కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్)కి వ్యవసాయం, క్రికెట్ అంటే ఇష్టం. ఒకవైపు తండ్రి చనిపోయి ఉంటే మరోవైపు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన కౌసల్య(ఐశ్వర్యా రాజేష్).. తాను పెద్ద క్రికెటర్ అయి, ఇండియా తరుపున ఆడి, టీమ్‌ను గెలిపించి, తండ్రిని సంతోషపెడుదామనే ఆలోచనతో పెరుగుతుంది. ఓ ఆడపిల్ల ఆటలంటూ బయటకి రావడం.. సమాజం చిన్నచూపు చూడటం.. ఇరుగుపొరుగు హేలన చేయడం.. ఇవన్నీ దాటుకుని కౌసల్య తన కలను ఎలా సాధించిందన్నదే కౌసల్య కృష్ణమూర్తి కథ. నటీనటులు: చిన్నప్పటి నుంచి తండ్రి ఇష్టాన్ని చూస్తూ పెరిగి.. తన తండ్రి కన్న కల కోసం పాటుపడే కౌసల్య పాత్రలో ఐశ్యర్యా రాజేష్ అద్భుతంగా నటించింది. కళ్లతోనే భావాలను పలికించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రొఫెషనల్ క్రికెటర్లా కనిపించేందుకు ఐశ్వర్య పడిని శ్రమ తెరమీద కనిపించింది. భూమినే ప్రాణంగా నమ్ముకునే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చక్కగా నటించాడు. రైతు పడే కష్టాలను చూపించే సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. కృష్ణమూర్తి భార్యగా, కౌసల్య తల్లి సావిత్రి పాత్రలో ఝాన్ని తన అనుభవాన్ని చూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ముగ్గురూ పోటీపడి మరీ నటించారన్నట్లుగా ఉంది. కౌసల్యను ప్రేమిస్తూ.. ఆమె లక్ష్య సాధనలో సాయపడే సాయికృష్ణ పాత్రలో కార్తీక్ రాజు బాగానే నటించాడు. ప్రత్యేక పాత్రలో నటించిన శివ కార్తికేయన్ ఆకట్టుకున్నాడు. మిగిలిన వారంతా తమ పాత్రపరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ : కౌసల్య కృష్ణమూర్తి.. తమిళ హిట్ కణా మూవీకి రీమేక్. అయితే ఈ మధ్య ఏ భాషలోనైనా సరే ఓ సినిమా బాగుందనే టాక్ వస్తే మన ప్రేక్షకులు చూసేస్తున్నారు. ఇదే ఈ సినిమాకు నెగెటివ్‌గా మారొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. కథలో ఉన్న ఫీల్‌ను మిస్ చేయకుండా, మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. క్రీడా నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు రాగా.. క్రికెట్‌ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను కూడా గతంలో మనం చూశాం. ఈ చిత్రానికి వచ్చే సరికి కథ కొత్తది కాకపోయినా.. రైతుల కష్టాలను కథలో భాగం చేస్తూ కథనాన్ని రాసుకున్నారు. ఈ మూవీలో క్రికెట్‌ను ఓ ట్రాక్‌గా చూపిస్తూనే.. రైతు, వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రికెటర్‌గా ఎదిగేందుకు కౌసల్య పడే కష్టాలను చూపిస్తూ.. మరోవైపు ఈ దేశంలో రైతుగా బతకడం ఎంత కష్టమో, వారు అనుభవించే దుర్భర పరిస్థితులను చూపించాడు. అయితే కథనం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం కాస్త నిరాశపరుస్తుంది. రైతు గురించి చెప్పే డైలాగ్‌లు, క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం మేజర్ ప్లస్. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్యం సంగీతంతో మరో లెవల్లో చూపించాడు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్ : ఐశ్వర్యా రాజేష్ సంగీతం మైనస్ పాయింట్స్ : తెలిసిన కథ ఊహకందేలా సాగే కథనం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్‌గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్‌గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► తమిళ్లో నా పాత్రలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్ రోల్ చేసిన ‘కణ’కి ఇది రీమేక్. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది. ► రాజేంద్రప్రసాద్‌గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. కె.యస్. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది. ► క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్ మ్యాచ్’ త్వరలో విడుదలవుతుంది. -
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రెస్‌మీట్
-
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు
‘‘కేయస్ రామారావుగారిని మేము ‘పప్పా’ (డాడీ) అని పిలుస్తాం. ఆయన ప్రతిరోజూ సెట్లో ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి.. మేం చూసుకుంటాం అంటే.. నాకు నచ్చింది, వచ్చింది సినిమా.. ఇదే నా లైఫ్. ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం అంటారు. ఇన్ని సినిమాలు చేసినా ఆయన ఇప్పటికీ సినిమాలను ప్రేమిస్తారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్ సార్.. మీరు ఈ లైఫ్‌లో చేసినన్ని సినిమాలు నా లైఫ్‌టైమ్‌లో చేయలేనేమో? మీరు చేసిన సినిమాలు, పాత్రలు, అనుభూతులు ఇప్పుడు మా వల్ల కాని పని.. మీలాంటి వారే మాకు స్ఫూర్తి. ఐశ్వర్య నటించిన కొన్ని తమిళ చిత్రాలు చూశాం.. చాలా బాగా చేసింది. మీరు (ఫ్యాన్స్) అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మన సినిమాలు వస్తున్నాయ్.. త్వరలోనే దింపుతున్నాం. నీటిని వృథా చేయకండి. 2022కి తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి లీకేజీలను అరికడదాం. ఓ రోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. పెట్రోల్లా నీళ్లు కూడా లిమిటెడ్‌గా ఉన్నాయి.. పొదుపుగా వాడండి’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్ కమర్షియల్స్‌లో 40 ఏళ్ల క్రితం ‘ఛాలెంజ్’ అనే సినిమాలో తొలిసారి నటించా. ఆ తర్వాత అనుకోకుండా నేను కామెడీ హీరోగా బాగా సక్సెస్ అయ్యాక కూడా నాతో ‘ముత్యమంత ముద్దు’ అని అద్భుతమైన సినిమా చేయించారాయన. ఈ సంస్థ ఇంతకాలం ఈ సంస్థ అద్భుతమైన స్థానంలో ఎందుకుంది అంటే.. మంచి సినిమాలు, గుర్తుండే సినిమాలు, సామాజిక సృహ ఉన్న సినిమాలు అందించింది కాబట్టి. నాలుగు మంచి సినిమాలు వెనకేసుకున్న బ్యానర్ కాబట్టి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది. ఒరిజినల్ కంటే రీమేక్‌లు బాగా తీశాడు కాబట్టి భీమనేని శ్రీనివాస్‌కి ఇంత మంచి పేరుంది. ‘కణ’ సినిమా కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ బాగుంటుంది. నా జీవితంలో ఓ 10 సినిమాలుంటే వాటిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పుడూ రీమేక్‌ని రీమేక్‌లా చేయలేదు. ఫ్రెష్ స్టోరీలా భావించి మన నేటివిటీకి తగ్గట్టు చేసుకుంటూ వచ్చా.. అందుకే హిట్స్ సాధించా. ఈ మధ్య క్రికెట్ నేపథ్యంలో వచ్చినవి మేల్ సెంట్రిక్ ఫిల్మ్స్.. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. కౌసల్య పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం క్రాంతి మాధవ్. విజయ్ దేవరకొండతో మేం చేయనున్న సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పాడు. ఆ సమయంలో ఐశ్వర్య నటించిన ‘కణ’ టీజర్ చూసి బాగుందని రీమేక్ చేశాం. ‘కణ’ కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకి తెలుగులోనే తను ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే ఇక్కడ మొదటి సినిమా కాబట్టి. నా సినిమాల్లో కథ బాగుందంటే అవి తయారు చేసిన వారి గొప్పదనం అది. వారందరూ గొప్ప రచయితలు, దర్శకులు, నటులు.. ఎంతో గొప్పగా చేయబట్టి, అవి నాకు నచ్చబట్టి.. ఓ నిర్మాతగా నేను కూడా వ్యాపారం చేసుకోవచ్చని భావించా. సినిమా వ్యాపారం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయితే వాటిల్లో మన సినిమా గొప్పగా ఉండాలనుకుంటే తప్ప ఆ సినిమా బతికి బట్టకట్టలేని పరిస్థితి. అలాంటి సినిమాలు చేయడానికి కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె.విశ్వనాథ్, అజయ్... ఇలా ప్రతివాళ్లూ కష్టపడ్డారు. నా గురించి, నా బ్యానర్ గురించి వారంతా కష్టపడితేనే గొప్ప సినిమాలొచ్చాయి. 2019లో ఓ మంచి సినిమా చూశామని సంతృప్తిగా చెప్పుకునే చిత్రమిది. మా సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న నా స్నేహితులకు థ్యాంక్స్.. కొనటానికి రాని, పెద్ద సినిమాలే కొనే మిత్రులకు కూడా థ్యాంక్స్.. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని నేనే రిలీజ్ చేస్తున్నా. ఈ సినిమాని అమ్మటానికి నేను ప్రయత్నించా.. కానీ, ఐశ్వర్యారాజేష్ ఏమైనా అమితాబ్ బచ్చనా? చిరంజీవినా? అనుకొని ఉండొచ్చు. సినిమా చూస్తే ఆవిడేంటో తెలుస్తుంది’’ అన్నారు. ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ – ‘‘నా తొలి చిత్రం క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో సైన్ చేశా.. అదే ఫస్ట్ సినిమా అవుతుందనుకున్నా. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ అయింది. తమిళ్లో 25 సినిమాలు చేశా.. ఆ తర్వాత ‘కణ’ నాకు వచ్చింది. ఆ సినిమా నా కల. అది బ్లాక్‌బస్టర్ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు. ఇలాంటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం లక్కీ. ఈ సినిమాకి బెస్ట్ నటిగా తమిⶠంలో 10 అవార్డులు తీసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు. కెమెరామేన్ ఆండ్రూ, ఏషియన్ సినిమాస్, నిర్మాత నారాయణ్‌దాస్, హీరోయిన్ రాశీ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఒకే రోజు పది సినిమాల రిలీజ్!
ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున సాహో మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్ని ఆగస్టు 23న రిలీజ్‌కు క్యూ కట్టాయి. దీంతో ఒకే రోజు 10 సినిమాలో బాక్సాఫీస్ బరిలో తలపడుతున్నాయి. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగా కూడా ప్రేక్షకులకు తెలియదు. తమిళ్లో సక్సెస్ అయిన కనా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమాలపై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్, ఉండిపోరాదే, నివాసి, హవా లాంటి సినిమాల సందడి మీడియాల కాస్త కనిపిస్తుంది. నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, కనులు కనులు దోచేనే విషయంలో ఆ సందడి కూడా కనిపించటం లేదు. మరి ఈ పది సినిమాల్లో ప్రేక్షకులు ఎన్ని సినిమాలను ఆదరిస్తారో చూడాలి.